Jyothika : ఆ స్టార్ హీరోతో

ఒక దశాబ్దం క్రితం తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్‌ల‌లో జ్యోతిక ఒకరు. కోలీవుడ్ లో, టాలీవుడ్ లో అగ్ర హీరోలతో ఈమె చాలా సినిమాలు చేసింది. చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలతో కూడా తెరను పంచుకుంది. జ్యోతిక సినిమా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. సూర్య-జ్యోతిక జంట కేవలం కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ అంత‌టిలో కూడా క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు.

పెళ్లి తర్వాత ఈ అలనాటి స్టార్ హీరోయిన్ ఇటీవల సిల్వర్ స్క్రిన్ పైకి రీ ఎంట్రీ ఇచ్చింది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ వచ్చింది. అయితే తాజాగా జ్యోతిక ఒక లవ్ స్టోరీ చేయడానికి సిద్ధమైంది. మాలీవుడ్ సీనియర్ హీరో మమ్ముట్టితో జ్యోతిక ఒక ప్రేమకథలో నటిస్తుంది. ఈ చిత్రానికి కాదల్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోలో జ్యోతిక, మమ్ముట్టి కనిపిస్తున్నారు. దీన్ని చూస్తే క్లాసిక్ ఫీలింగ్ కలుగుతుంది.

కాగా దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ బేబి తెరకెక్కిస్తున్నాడు. అలాగే మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రానుంది. అయితే జ్యోతిక, మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు