Karthi : ఫస్ట్ లుక్..

హీరో కార్తీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఖైదీ’ సంచలన విజయంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన ఈ తమిళ స్టార్ రీసెంట్ గా పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో ‘సర్దార్’ మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో తలెత్తనున్న వాటర్ చుట్టూ ఊహించని విధంగా భారీ స్థాయిలో బిజినెస్ జరగబోతుందని, సామాన్యుడికి భవిష్యత్తులో నీటి చుక్క కూడా దొరకదనే కథతో ఓ స్పై త్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది.

 మరో కొత్త కథతో గత వారం ప్రారంభంలో ‘జపాన్’ అనే టైటిల్ తో తదుపరి పెద్ద ప్రాజెక్టుని స్టార్ట్ చేశాడు.కోకిల, జోకర్,  జిప్సీ వంటి సినిమాలకు ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత చిత్ర నిర్మాత రాజు మురుగన్ దర్శకత్వంలో చిత్రీకరణ జరగనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇక కార్తీ జపాన్ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. అతని 25వ సినిమాగా వస్తున్న ఈ జపాన్ ఫస్ట్ లుక్ ను సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో హీరో కార్తీ ఓ సోఫాలో తాగి పడిపోయి ఉంటాడు.

అతని చేతిలో ఒకటి, ముందు మరో మందు సీసాలతో పాటు ఓ అమ్మాయి తొడల వరకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అతని వెనుక ఉన్న ఫోటో ఫ్రేమ్ లో కార్తీ పూర్తిగా గోల్డెన్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎడమ చేతిలో గోల్డెన్ గ్లోబ్, కుడి చేతిలో గన్ను కనిపిస్తోంది. ఇవన్నీ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ జపాన్ మూవీలో కార్తీకి జోడి అను ఇమ్మానుయేల్ నటిస్తోంది. ఇక టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా ఇదే సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు