Sir : ఆకట్టుకుంటున్న మాస్టారు

ధనుష్ నటించిన ‘సర్’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ సరసన మలయాళ నటి సంయుక్తా మీనన్ నటిస్తుంది. తాజాగా ‘సర్’ చిత్రంలోని మొదటి పాట విడుదలైంది.

‘మాస్టారు మాస్టారు’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటను తమిళ్ లో ధనుష్ రచించగా, తెలుగులో రామజోగయ్య శాస్త్రి రచించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ పాటను శ్వేతా మోహన్ ఆలపించారు. డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ 3.75 కోట్లకు సొంతం చేసుకుంది.

ధనుష్ తాజా చిత్రం ‘నేనే వరువేన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో సెల్వరాఘవన్ కూడా అతిథి పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తెలుగులో మొదటి సారి ఫిలిం చేస్తున్న ధనుష్ కి “సార్” సినిమా మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఎంతవరకు నిలబడతాయో తెలియాలి అంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు