Kalyan Ram : ఈసారి గ‌న్‌తో

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, దర్శకుడు వశిష్ట ఇటీవల బింబిసారా సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయి సక్సెస్ ను సాధించింది. రిలీజ్ అయిన తొలి షో నుంచి.. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించిన సంగతి విధితమే. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా. టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసారా అనే రాజు పాత్రలో కనిపించి, కనువిందు చేశాడు.

తక్కువ థియేటర్స్ లోనే డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకొని రికార్డులను సృష్టిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం హీరో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో 19వ సినిమాను లైన్లో పెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత స్వరాలు అందిస్తున్నాడు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల గోవాలో ప్రారంభం అయింది.

తాజాగా అది విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రం బృందం.. ఓ పోస్టర్ ద్వారా పేర్కొంది. ఈ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ గన్ పట్టుకుని ఉన్నాడు. అలాగే అతి త్వరలో ప్రారంభం కానున్న లాస్ట్ షెడ్యూల్ తో మూవీ మొత్తం పూర్తి అవుతుందని.. అనంతరం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను వరుసగా రిలీజ్ చేస్తామని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. బింబిసారా తర్వాత వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు