Rakul Preet Singh:నాకు బ్యాక్గ్రౌండ్ లేదు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి పేరుని తెచ్చుకుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలలో తన గ్లామర్ తో ఒక ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.

ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేని రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రివాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఛత్రివాలి పేరుతో వస్తున్న ఈ సినిమా జీ 5 ఓటిటిలో జనవరి 20వ తేదీన స్ట్రీమింగ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

తన కెరీర్ ప్రారంభంలో ఆమెకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ.. “ఇండస్ట్రీలో నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. ముంబైలో నేను కాండీవాలిలో ఉండేదాన్ని. కానీ నా ట్రైనర్ తో కలిసి బండ్రలో ఒక కేఫ్ లో కూర్చొని ఏ ఏ ఆఫీస్ కి వెళ్ళాలి? ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలి? అనే దాని గురించి ప్లాన్ చేసేదాన్ని. బండ్ర, అంథేరీలో ఏమైనా ఆడిషన్స్ ఉంటే వెళ్ళొచ్చు అని ఆ కేఫ్ కి వెళ్లేదాన్ని. బ్యాగులో కొన్ని డ్రెస్సులతో కారులోనే కూర్చునేదాన్ని. ఒక్కొక్కసారి ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారేది. ఒక్కోసారి నాతో కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత వేరే హీరోయిన్ ని తీసుకునేవారు. ఇదంతా నేను పోరాటం అనుకోలేదు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం నాది కాదు. అందుకే పోరాటం అనే పదం నాకు నచ్చదు. ప్రతిరోజు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను” అని చెప్పుకొచ్చింది రకుల్.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు