మార్వెల్ సినిమాలు చూసి సినిమాటిక్ యూనివర్స్ లను సౌత్ ఇండస్ట్రీలో కూడా క్రియేట్ చేస్తున్నారు కొంత మంది దర్శకులు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ తమ సినిమాటిక్ యూనివర్స్ లను అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ కంటే ముందు డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించాడు. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటికే విశ్వక్ సేన్ తో HIT1 ను రిలీజ్ చేశాడు. తాజాగా అడివి శేష్ తో HIT2 ను తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్ధాం..
కథ :
విశాఖపట్నం ఎస్పీ గా కృష్ణదేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్) ఉంటాడు. ఏ నేరస్థున్ని అయినా క్షణాల్లో కనిపెట్టగల ఇంటెలిజెంట్ పోలీస్ కేడీ. ఎలాంటి హై ప్రోఫైల్ కేసులు రాని విశాఖపట్నంలో ఒక రోజు సంజన అనే యువతిని అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేస్తారు. ఈ కేసును కేడీ తీసుకుంటాడు. మరీ ఇంటెలిజెంట్ కాప్ కేడీ ఈ కేసును ఎలా ఛేదించాడు ? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లును ఎదుర్కొన్నాడు ? కేడీ లవర్ ఆర్య (మీనాక్షీ చౌదరి) ను సీరియల్ కిల్లర్ ఎందుకు టార్గెట్ చేస్తాడు ? ఇంతకీ సైకో కిల్లర్ ఎవరు ? అనేది మిగితా స్టోరీ.
విశ్లేషణ :
క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూడటానికి రెడీగా ఉంటారు. అయితే ఈ జానర్ లో ప్రేక్షకులను చివరి వరకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ, బోర్ ఫీలింగ్ రాకుండా.. మధ్యలో ట్విస్ట్ లు ఇస్తూ ఆధ్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది. అలా చేయడంలో డైరెక్టర్ శైలేష్ కొలను సక్సెస్ అయ్యాడు.
ఒక కేసును ఒక దర్శకుడి కోణంలో కాకుండా.. పోలీస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, ఎన్నో కేసులను ఛేదించిన ఎక్స్ పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒక సినిమాను కథను రాస్తే.. అది ఇలాగే ఉంటుందేమో.. అనిపించేలా హిట్2ను తెరకెక్కించాడు శైలేష్. సినిమాలో కొన్ని వైలెన్స్ సన్నివేశాలను ఒళ్లు గగుర్పాటు కలిగించేలా, వెన్నులో వణుకు పుట్టించేలా చూపించాడు. అంటే ఇక్కడ శైలేష్ సినిమా కోసం ఎంత రీసెర్చ్, ఎన్ని కేసులను స్టడీ చేసి ఉంటాడో అర్థమవుతుంది.
సినిమా ప్రారంభం నుంచే టైం వేస్ట్ చేయకుండా.. హీరో, హీరోయిన్ పాత్రలను పరిచయం చేసి, ఓ రొమాంటిక్ సాంగ్ ను పెట్టిసి, వెంటనే మెయిన్ ట్రాక్ లోకి వెళ్లాడు. ఒక వైపు కేడీ పవర్ ఎంటో చూపిస్తూనే సైకో కిల్లర్ ఎవరు అని సస్పెన్స్ క్రియేట్ చేశాడు. మధ్యలో అన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లాగే.. ఒక అమయాకున్ని హంతకుడిగా చిత్రీకరించి.. తర్వాత అసలు సైకో కిల్లర్ ఇతను కాదు అనే రోటీన్ సీన్ దీనిలో చొప్పించాడు. రోటీన్ సీన్ అయినా, ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందే తప్పా.. బోర్ ఫీలింగ్ రాదు.
ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్ సెకండాఫ్ పై, సైకో కిల్లర్ పై ఆసక్తిని పెంచుతాయి. ఇంతలా చేసినా సైకో కిల్లర్ ఎవరు ? అతని మోటీవ్ ఏంటి ? అనే ప్రశ్నలు ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. సెకండాఫ్ లో సైకో కిల్లర్ చేతిలో చనిపోయిన యువతుల గురించి, వారిని ఎలా చంపాడు అని అడివి శేష్ చేసే ఇన్వెస్టిగేషన్ కూడా హైలైట్ గా ఉంటుంది. కానీ చివరికి సైకో కిల్లర్ ను రివీల్ చేసే సమయంలో కొండను తవ్వి ఎలుకను తీశారా ? అనే ఫీలింగ్ అయితే రాకా మానదు.
ఈ విలన్ కొన్ని రోజుల ముందు ఒక సైకో కిల్లర్ సినిమా చేశాడు. బహుషా.. డైరెక్టర్ శైలేష్ ఆ సినిమాను చూసి ఉంటాడు. అందుకే అతన్ని ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ చిన్న విలన్ అయినా, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. సినిమా చివర అర్జున్ సర్కార్ ఎంట్రీ హిట్ 3పై హైప్ క్రియేట్ చేస్తోంది.
ఫర్మామెన్స్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం అడివి శేష్ కనిపిస్తాడు. నిజానికి ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో అడివి శేష్ తప్పా ఎవరినీ ఊహించుకోలేం. అలాగే మీనాక్షీ చౌదరికి కథపరంగా పెద్ద స్కోప్ లేదు. కానీ రొమాంటిక్ సీన్స్ లో ఈమె ఆకట్టుకుంటుంది. ఇక అడివి శేష్ కు అసిస్టెంట్ గా చేసిన కోమలి ప్రసాద్ నటన బాగుంది. రావు రమేష్, పోసాని మురళి కృష్ణ, తనికెళ్ల భరణి పాత్రలు చిన్నగా ఉన్నా తమ పరిధి మేరకు నటించారు.
ముఖ్యంగా సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాలి. ఒక్కోసారి హారర్ సినిమా చూసే ఫీలింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో వచ్చింది. కెమెరా పనితనం, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
చివరగా..
హిట్ ఇది షూర్ షాట్..
