మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న కేవలం మూడేళ్లకే విడాకులు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ నిహారిక, చైతన్య ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం నిహారిక అయితే పలు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంటోంది. అలాగే తన రిలేషన్ షిప్ పైన అప్పుడప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రెండో పెళ్లి గురించి చెబుతూనే.. పిల్లల్ని కనాలని ఉందనే విషయం పైన కూడా ఇటీవల నిహారిక పలు విషయాలను వెల్లడించింది.
చైతన్య జొన్నలగడ్డ పోస్ట్..
మరొకపక్క జొన్నలగడ్డ చైతన్య కూడా తన పనేంటో తాను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల నిహారిక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ పైన కూడా చాలా అసంతృప్తిని తెలియజేశారు. వన్ సైడ్ వాదనను మాత్రమే ప్రచారం చేయడం తప్పని.. ఇన్ డైరెక్ట్ గా నిహారికకు కౌంటర్లు వేశారు మాజీ భర్త చైతన్య. జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆయన సోషల్ మీడియాలోకి రారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సైలెన్స్ సైలెన్స్ అంటూ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతున్నది. అంతేకాదు దీని వెనక దాగి ఉన్న అర్థం ఏంటని అభిమానుల సైతం ఆరాతీస్తున్నారు.
View this post on Instagram
నిశ్శబ్దమే అన్నిటికీ కారణం..
సువిశాలమైన అంతరిక్షంలో సైలెన్స్.. నీటి అడుగు ఉన్న సైలెన్స్.. చల్లని శీతాకాలపు రాత్రి సైలెన్స్.. మీ హృదయాలను బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే సైలెన్స్.. మీ జీవితాన్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలలో మీరు కోరుకునే సైలెన్స్.. ఇలాంటి సైలెన్సే మీ ప్రాణ శక్తిని ప్రకృతి నుంచి వేరు చేస్తుంది. ఇదే సైలెన్స్ దేవుడితో మనల్ని కలిపే మాధ్యమం అంటూ ఒక ఫిలాసఫీని రాసుకురావడం జరిగింది జొన్నలగడ్డ చైతన్య. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతను ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ షేర్ చేశారో అంటూ పలువురు నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా చైతన్య ఎందుకు సైలెన్స్.. సైలెన్స్ అంటూ పోస్ట్ పెట్టారో అర్థం కాక అభిమానులు సైతం ప్రశ్నలు వేస్తున్నారు.. అయితే ఇదంతా కేవలం నిహారిక చేసినటువంటి ఇటీవల వ్యాఖ్యల వల్లే తాను ఇలా చేసి ఉంటారని సమాచారం.
నిహారిక – చైతన్య జొన్నలగడ్డల వివాహం..
ఇక నిహారిక , చైతన్యల పెళ్లి 2020లో రాజస్థాన్లో చాలా గ్రాండ్గా వివాహం జరిగింది.. ఆ తరువాత 2023లో పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడిపోయారు. ఇక విడిపోయిన తర్వాత ఎవరికి వారు తమ కెరియర్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. కానీ ఇలా అప్పుడప్పుడు ఇలాంటి సోషల్ మీడియా పోస్టులతో వైరల్ గా మారుతున్నారు ఈ జంట.
Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.