Javed Akhtar : సందీప్ రెడ్డి వంగ నా 53 ఏళ్ల కెరియర్ లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయాడు

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో శివ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని మళ్ళీ సందీప్ రెడ్డి తీసిన అర్జున్ రెడ్డి క్రియేట్ చేసింది.

ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించాడు సందీప్ రెడ్డి. అయితే ఈ సినిమాకి చాలా వెబ్సైట్స్ అండ్ ప్రముఖు సినీ జర్నలిస్ట్ లు నుంచి బాలీవుడ్ లో చాలా తక్కువ రేటింగ్స్ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ సినిమాకి ఆడియన్స్ మాత్రం 250 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అంటగట్టారు. ఈ సినిమా కూడా అక్కడ బీభత్సమైన హిట్ అయింది.

అయితే ఒక ప్రముఖ ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ ఒక మాట చెప్పుకొచ్చాడు. నా సినిమాను వీళ్ళందరూ వైలెంట్ ఫీల్ అని చెబుతున్నారు. ఐ విల్ షో దెమ్ వాట్ వైలెంట్ ఫిలిం ఇట్ ఇస్ అంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇకపోతే సందీప్ చేసిన లేటెస్ట్ ఫిలిం అనిమల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన ఘనవిజయాన్ని సాధించింది. దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.

- Advertisement -

అయితే ఈ సినిమా పైన చాలామంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా పైన చాలామంది ప్రముఖులు విరుచుకుపడ్డారు అని చెప్పొచ్చు. వారిలో జావేద్ అక్తర్ ఒకరు. అయితే ఈ వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ వచ్చాడు. “సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా మీ కుమారుడు ఫర్హాన్ అక్తర్ కి ఇవ్వాలి. మీ కుమారుడు నిర్మించిన మీర్జాపుర్ సిరీస్లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. కాబట్టి ముందుగా జావేర్అక్తర్ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఇప్పుడు సందీప్ కు కౌంటర్ గా జావేద్ మళ్లీ తిరిగి విమర్శలు చేశారు.’నా వ్యాఖ్యలకు సందీప్ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటలో కూడా ఆయన అసభ్యత, తప్పును కనిపెట్టలేకపోయాడు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను విమర్శించారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. నా 53 ఏళ్ల కెరీర్లో ఒక్క తప్పు కూడా వెతకలేక నా కుమారుడి సినిమాను చెప్పడం సందీప్ కి అదీ సిగ్గుచేటు అంటూ విమర్శించాడు.

ఇకపోతే ఇక్కడితో సందీప్ రెడ్డి వంగ ఊరుకుంటాడా లేదంటే తను మళ్ళీ రీకౌంటర్ వేసి దీనిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడా వేచి చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు