Anchor Syamala: అర్ధరాత్రిళ్ళు నరకం చూపించేవాడు… అతని గురించి బయట పెట్టిన శ్యామల

సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు.. చిన్న ఆర్టిస్టులను మొదలుకొని పెద్దపెద్ద స్టార్ సెలబ్రిటీల వరకు ఎన్నో కష్టాలు పడిన వారే.. అయితే వారు ఆ కష్టాలు పడినప్పుడు ఈ విషయాన్ని బయటకు చెప్పరు కానీ ఒక స్థానానికి చేరుకొని సక్సెస్ అయినప్పుడు కెరియర్ మొదట్లో తాము పడ్డ కష్టాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలలో ప్రథమంగా వినిపించే సమస్య క్యాస్టింగ్ కౌచ్.. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఈ సమస్య కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే ఎంతోమంది దీని బారిన పడిన బాధితులు ఒక్కొక్కరిగా పలు ఇంటర్వ్యూల సందర్భంగా తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అంటూ చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా, సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది యాంకర్ శ్యామల.. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఈమె కూడా ఎన్నో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించింది.

క్యాస్టింగ్ కౌచ్ పై శ్యామల స్పందన..
కెరియర్ మొదట్లో మా అమ్మతోపాటు హైదరాబాద్ వచ్చి సీరియల్స్ లో నటించే అవకాశాలను అందుకున్నాను.. అలా ఏకంగా మూడు సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి.. అయితే అదే సమయంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను.. నేను సీరియల్స్ చేస్తున్నప్పుడు చాలా ప్రపోజల్స్ వచ్చాయి..అందులో కొంతమంది అర్ధరాత్రి పూట కూడా ఫోన్ చేసి చాలా విసిగించారు … నేను పని చేస్తున్నటువంటి ఒక సీరియల్ కెమెరామెన్ నన్ను చూసి ప్రతిరోజు విసిగించేవాడు.. అయితే ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేస్తే మా అమ్మ లిఫ్ట్ చేసింది.. అతనేమో.. మీ అమ్మాయితో నేను మాట్లాడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదు.. కనీసం మీకు మగదిక్కు కూడా లేదు.. నేను మిమ్మల్ని ఏమైనా చేయగలను అంటూ మమ్మల్ని బెదిరించారు. ఇలా మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. దాంతో నేను కమిట్ అయినటువంటి మూడు సీరియల్స్ చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయం కూడా తీసుకున్నాను.. అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.

ఇండస్ట్రీ జీవితం..
అయితే ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ మామూలే అని కొంతమంది తనకు ధైర్యం చెప్పడంతో వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్లారట. అలా యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు దక్కించుకొని సినిమాలలో కూడా కీలక పాత్రలో నటించి మంచి పేరు దక్కించుకుంది శ్యామల.

- Advertisement -

వైవాహిక జీవితం..
ఇక శ్యామల మరొక సీరియల్ నటుడు నరసింహారెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి.. ఇంట్లో ఎదిరించి మరీ వివాహం చేసుకుంది. అయితే ఆ సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.. ఇక వివాహమనంతరం నరసింహారెడ్డి పై ఎఫైర్ రూమర్స్ వినిపించినా వాటిని ఖండించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో నెటిజన్స్ ను అలరిస్తోంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు