Bhoomi Shetty: ఇంట్లో నుంచి గెంటేశారు.. హేళన చేశారు

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది తమలోని టాలెంట్ ను బయటకు పెట్టి సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే అలా కొంతమంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇండస్ట్రీ లోకి వస్తే మరి కొంత మంది తమ కోరికలను చంపుకోలేక కుటుంబ సభ్యులను సైతం ఎదిరించి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ భూమి శెట్టి కూడా ఒకరు.. సీరియల్ నటిగా కెరియర్ మొదలుపెట్టిన ఈమె అనతి కాలంలోనే హీరోయిన్గా మారి సినిమాలలోకి అడుగు పెట్టింది.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన భూమి శెట్టి మొదట హీరోయిన్గా “షరతులు వర్తిస్తాయి” అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ ఎలా మొదలయ్యింది..? ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అన్న విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించింది..

ఆరేళ్లపాటు కుటుంబ సభ్యులు మాట్లాడలేదు..
మా సొంత ఊరు కర్ణాటకలోని కుందపుర.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను.. చిన్నప్పటి నుంచి జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక ఉండేది.. అయితే ఇంట్లో వాళ్ళు నాకు కొన్ని హద్దులు పెట్టారు.. ఇంజనీరింగ్ చదువుకోడానికి బెంగళూరు వెళ్తానంటే అంగీకరించలేదు.. డిగ్రీ చదివి పెళ్లి చేసుకో అని చెప్పారు.. బెంగళూరు వెళ్తే నీతో మాట్లాడము అని కూడా చెప్పారు.. అయితే వాటన్నింటినీ పక్కనపెట్టి బెంగళూరు వెళ్లిపోతానని చెప్పాను. దాంతో ఇంట్లో నుంచి గెంటేశారు.. అంతేకాదు పైగా ఆరేళ్లపాటు నాతో మాట్లాడలేదు కూడా..ఇక చదువుతున్న రోజుల్లోనే ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ లో పాల్గొన్న నాకు ఎన్నో ఆడిషన్స్ తర్వాత సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది.. అయితే నటిని అయ్యాక ఒక రియాల్టీ షోలో పాల్గొని.. నా కుటుంబానికి క్షమాపణలు చెప్పాను.. అప్పటి నుంచే వాళ్ళు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు అంటూ తెలిపింది భూమి శెట్టి.

శరీర రంగు పై విమర్శలు..
చిన్నప్పటినుంచి నేను ఎదుర్కొంటున్న అవమానాలలో నా శరీర రంగు కూడా ఒకటి.. ఎన్నోసార్లు బాధపడ్డాను.. ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్తే.. ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? తెల్లగా మారడానికి ఏదైనా కాస్మెటిక్స్ ఉపయోగించవచ్చు కదా ?అంటూ పలువురు సన్నిహితులు కూడా చెప్పేవారు. అంతేకాదు ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తే నల్లగా ఉన్నావని కామెంట్స్ చేస్తూ ఉంటారు.. వాటిని పెద్దగా పట్టించుకోని ఎందుకంటే నేను ఎంత అందంగా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.. ఇలాంటి ఎన్నో అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి వచ్చాను అంటూ భూమిశెట్టి తెలిపింది.. ఇకపోతే ఈమె చూడడానికి రంగు విషయంలో కాస్త నల్లగా ఉన్నా.. తన అందంతో రూపంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. అందుకే ఈమెకు సినిమాలలో అభిమానులు పట్టం కడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు