Razakar: ఆ స్టార్ యాంకర్ భర్తే రజాకార్ మూవీ డైరెక్టర్..!!

గడిచిన రెండు రోజుల క్రితం నుంచి ఎక్కువగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు రజాకార్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.. ఈ సినిమా నిజాం రాజుల పరిపాలనకి అర్థం పట్టేలా ఉండడంతో చాలామంది ఈ చిత్రాన్ని చూడడానికి మక్కువ చూపుతున్నారు. అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బీజేపీ ఈ సినిమాను మతం పేరుతో వాడుకోవడం వల్ల ఒక వర్గం ప్రజలు ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.. కానీ ఓవరాల్ గా రజాకార్ సినిమాతో మాత్రం ఓవర్ నైట్ కి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు యాట సత్యనారాయణ..

డైరెక్టర్ పై ప్రశంసలు..
ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండడంతో ఈ డైరెక్టర్ ని అందరూ ప్రశంసిస్తున్నారు.. అయితే ఈ సినిమాకి బీజేపీ అనే పదం ప్రచారం చేయకపోతే కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా చూసేవారని తెలుస్తోంది.. మత రాజకీయాలు కాసేపు పక్కన పెడితే ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పవచ్చు. రజాకార్ సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ డైరెక్టర్ కాకముందు పలు సీరియల్స్ కి కూడా దర్శకత్వం వహించారట.. ముఖ్యంగా ఈయన బుల్లితెర పైన కొన్ని సీరియల్స్ కి సైతం దర్శకత్వం వహించారని తెలుస్తోంది.

డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్..
ముఖ్యంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో రాజమౌళి కూడా అక్కడే పని చేసేవారట.. అలాగే హీరో నాని కూడా తనకి బాగా తెలుసు అని.. నాని హీరో అయిన తర్వాత తనతో ఎప్పుడూ కూడా మాట్లాడలేదనే అసహనాన్ని వ్యక్తం చేశారు యాట సత్యనారాయణ. ఈ విషయాలని పక్కన పెడితే రజాకార్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ యాట సత్యనారాయణ.. ఎవరో కాదు ఒకప్పటి స్టార్ యాంకర్ భర్త అన్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

స్టార్ యాంకర్ భర్త..
ఇక ఆమె ఎవరో కాదు నవీన.. బుల్లితెర పైన యాంకర్ గా నటిస్తూనే పలు సీరియల్స్ లో కూడా నటించి భారీగానే క్రేజీ సంపాదించుకుంది నవీన.. ఇక ఈ నవీన భర్తనే ఈ యాట సత్యనారాయణ.. వీరిద్దరూ సీరియల్స్ చేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకెళ్లారట. ప్రస్తుతం అయితే నవీన సీరియల్స్ లో ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకు దూరమైనట్టుగా తెలుస్తోంది ..కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు అభిమానులకు సడన్ సర్ప్రైజ్ లు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసి నవీన అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికైతే స్టార్ యాంకర్ గా అప్పట్లో భారీ పాపులారిటీ దక్కించుకొని సీరియల్స్ లో కూడా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై అవకాశాలు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈమె భర్త ఒక్క సినిమాతో ఈ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు