Magadeera: ఇది కదా కావాల్సింది

రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మొదలైన ఈ ట్రెండ్, అద్భుతంగా ముందు కొనసాగుతుంది. అయితే ముందుగా ఒక్కడు సినిమాను రీ రిలీజ్ చేశారు ఆ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత పోకిరి సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాను ఫ్యాన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది. అలానే జల్సా సినిమాను కూడా రిలీజ్ చేశారు. జల్సా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంజయ్ సాహు క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనిపించిన విధానం. త్రివిక్రమ్ డైలాగ్స్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఇవన్నీ కూడా సినిమాకి ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అని మనకు తెలియంది కాదు. మళ్లీ జల్సా సినిమా రిలీజ్ వైబ్ ను ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్.

ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఆరెంజ్ సినిమాను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ నటించిన చత్రపతి, అల్లు అర్జున్ నటించిన దేశముదురు, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలను కూడా రిలీజ్ చేశారు అయితే వీటికి అనుకున్న ఫలితం మాత్రం రాలేదని చెప్పాలి.

- Advertisement -

ఇక అసలు విషయానికి వస్తే చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, చిరు తనయుడు అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన మొదటి సినిమాతోనే తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు చరణ్. మొదటి సినిమాతో హిట్ అందుకుని తన రెండవ సినిమా మగధీర తో తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను లిఖించాడు చరణ్.

ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం విధితమే. కానీ 14 ఏళ్ల క్రితమే అతి పెద్ద సాహసానికి బాటలు వేసింది గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ.గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ అథినేత, మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తన దగ్గరున్న మొత్తాన్ని “మగధీర” సినిమా కోసం వెచ్చించారు. దానికి మూడింతలు మగధీర సినిమా వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన కంటెంట్ అంతా పుష్కలంగా ఉన్న సినిమా మగధీర.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని కాలభైరవ, మిత్రబింద కేరక్టర్స్ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికి, ఎప్పటికి చిరస్థాయిగా మిగిలిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. మగధీర సినిమా మళ్ళీ ఇప్పుడొస్తే ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా, అదే జరగబోతుంది. మార్చ్ 27 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. మార్చి 26 తారీకు నుంచి ఈ సినిమా ప్రదర్శించబడుతుంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు