Anushka Shetty: డీ గ్లామర్ రోల్‌లో అనుష్క… ఘాటి అంటూ గట్టి ప్లాన్

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ ను షేక్ చేసిన అనుష్క శెట్టి, ఇప్పుడు పెద్దగా సినిమాలేమీ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్విటీ… ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా వైడ్ చక్రం తిప్పాలని అనుకుంది. కానీ, ఈ సినిమానే కెరీర్ లో చివరి భారీ సినిమా అయిపోయింది. బాహుబలి తర్వాత అనుష్క చేసిన ప్రయోగాత్మక చిత్రం సైజ్ జీరో… స్విటీ కెరీర్ ని మొత్తం మార్చేసింది.

సైజ్ జీరో తర్వాత…
అనుష్క సైజ్ జీరో సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిపోయింది. తర్వాత బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేసినా, అవేవీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక చేసేదేమీ లేక హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేసుకుంటూ వచ్చింది. అలా… భగమతి, నిశ్శబ్ధం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఇటీవల యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఈ సినిమా సక్సెస్ అయినా, గతంలో ఉన్న వైభవం అయితే అనుష్కకు రాలేదనే చెప్పాలి.

మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ…
ఇప్పటి వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అనుష్క శెట్టి, ఇప్పుడు మరో హీరోయిన్ ప్రాధాన్యత సినిమాను చేయబోతుంది. ఈ సందర్భంగా అప్డేట్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో తమ ఓటీటీలో వచ్చే సినిమాల అప్డేట్స్ ను వరుసగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుష్క శెట్టి చేయబోతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా అప్డేట్ ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇచ్చింది. దీంతో అనుష్క శెట్టి చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ తీసుకుందని, ఇది థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తుంది.

- Advertisement -

టైటిల్.. స్టోరీ ఇదే..
అనుష్క చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఘాటి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు నిన్నటి ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క డీ గ్లామరస్ పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. అలాగే సినిమాలో అనుష్క ఓ సమస్య బాధితురాలిగా ఉంటుందట. దానిపై పోరాటం చేసి, చివరికి తానే క్రిమినల్ గా మారి విలన్లను అంతం చేస్తుందని సమాచారం. పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తో పాటు క్రిష్ కు చెందిన ఫస్ట్ ప్రైమ్ ఇంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కెరీర్ టర్న్ అవుతుందా..?
ఘాటి సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ను చూసినా, ప్రచారంలో ఉన్న స్టోరీ లైన్ చూసినా, సినిమా సీరియస్ మోడ్ లో ఉంటుందని అర్థం అవుతుంది. అలాగే సినిమా హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఈ ఘాటి సినిమాతో అయినా, అనుష్క శెట్టి కెరీర్ గాడీలో పడుతుందా? లేదో చూడాలి మరి

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు