Ustaad Bhagat Singh: ఏంటి… ఇది హరీష్ ఐడియా కాదా..?

పవన్ కళ్యాణ్ మానియా నడుస్తుంది. ఏపీ ఎన్నికల వల్ల ఎప్పుడూ వార్తల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ కు నిన్న వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌తో మరింతగా చర్చ నడిచింది. ముఖ్యంగా సినిమా టీజర్‌లో వచ్చిన గాజు డైలాగ్ ప్రస్తుతం ఉన్న పొలిటికల్ విషయాలను గుర్తుచేసేలా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆయన పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చినట్టు టీజర్ ఉంది. టీజర్ పెద్దగా ఏం లేకున్నా… అందులో వచ్చే డైలాగ్స్‌తో ఫ్యాన్స్ నుంచి అరుపులు వస్తున్నాయి. టీజర్‌ను రిలీజ్ చేసినందుకు డైరెక్టర్ హరీష్ శంకర్ కు అభిమానులు థాంక్యూ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. అయితే ఈ టీజర్ ను రిలీజ్ చేసే ఐడియా హరీష్ శంకర్ ది కాదు… మరి ఎవరిది ?

టీజర్ రెస్పాన్స్…
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి టీజర్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఇతర హీరోల టీజర్ రికార్డులను బ్రేక్ చేయాలని పవన కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ పెట్టుకుని మరీ టీజర్ ను షేర్ చేస్తున్నారు. అలాగే టీజర్‌లో “ఖచ్చితంగా గుర్తు పెట్టుకో… గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం… కనిపించని సైన్యం” అంటూ వచ్చిన గ్లాస్ డైలాగ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

హరీష్ ఫోర్స్ వల్లే చేశా- పవన్
తనకు సినిమాల్లో రాజకీయ పరమైన డైలాగ్స్ చెప్పడం ఇష్టంలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో గ్లాస్ డైలాగ్ పై తెగ చర్చ జరిగింది. దీంతో ఓ పబ్లిక్ మీటింగ్ లో ఈ గ్లాస్ డైలాగ్ పై పవన్ కళ్యాణ్ స్పందించాడు. సినిమాల్లో పొలిటికల్ కనిపించొద్దని, అలాంటి డైలాగ్స్ చెప్పొద్దని అనుకున్నారట. కానీ, డైరెక్టర్ హరీష్ శంకర్ ఫోర్స్ చేయడం వల్లే ఆ గ్లాస్ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.

- Advertisement -

టీజర్ హరీష్ ప్లాన్ కదా…?
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన టీజర్ ఇటు సినిమా ఇండస్ట్రీలో, అటు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీజర్ ప్లాన్ డైరెక్టర్ హరీష్ శంకర్ ది కాదట. నిన్న (మంగళవారం) అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు తమ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లపై అప్డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ వేదికగానే అమెజాన్ లో స్ట్రీమ్ అవ్వబోయే సినిమాల, వెబ్ సిరీస్ ల యొక్క టైటిల్స్, ఫస్ట్ లుక్, టీజర్ లను రిలీజ్ చేశారు.

ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ నేపథ్యంలో అన్ని సినిమాలకు, వెబ్ సిరీస్ లకు అప్డేట్స్ ప్లాన్ చేసుకోవాలని అమెజాన్ ప్రైమ్ వాళ్లు ముందే చెప్పారట. ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేని సినిమాలకు టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని చెప్పారట. అలాగే ఇప్పటికే టైటిల్ రిలీజ్ అయి ఉన్న సినిమాలకు టీజర్ ప్లాన్ చేసుకోవాలని సలహా ఇచ్చారట. అలా… ఉస్తాద్ భగత్ సింగ్ గానీ కంగువా సినిమా టీజర్‌లు వచ్చాయి.

బిజీ బిజీ హరీష్...
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏళ్ల పాటు వెయిట్ చేశాడు. తన చివరి సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో గద్దల కొండ గణేష్. ఈ సినిమా తర్వాత హరీష్ నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు. ఫైనల్ గా పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అని అనౌన్స్ చేశారు. కానీ, ఎలక్షన్స్ వల్ల మళ్లీ దానికి బ్రేకులు పడ్డాయి. దీంతో పవన్ తో అయ్యే పని కాదు అని, రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిందనే టాక్ కూడా నడుస్తుంది. దీంతో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లను ఓకే చేసే పనిలో ఉన్నట్టు టాక్.

ఇంత బిజీ ఉన్న హరీష్ కు అమెజాన్ నుంచి కాల్ రావడంతో హడావుడిగా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ కట్ చేసి, పవన్ కళ్యాణ్ తో రెండు డైలాగ్స్ డబ్బింగ్ చెప్పించి అనుకున్న టైంకి టీజర్ ను రిలీజ్ చేశారట.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు