Arabia Kadali : “తండేల్”ను టార్గెట్ చేసిన ప్రైమ్… సేమ్ స్టోరీతో కొత్త కథ

అమెజాన్ ప్రైమ్ టాలీవుడ్ యంగ్ హీరోలను టార్గెట్ చేసిందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలకు దగ్గరగా ఉండే స్టోరీలతో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ లను అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. మరి ఆ వెబ్ సిరీస్ లు ఏంటి? వాటికి టాలీవుడ్ లో రూపొందుతున్న సినిమాలకు తేడాలేంటి? అనే విషయంలోకి వెళ్తే…

“తండేల్” వర్సెస్ అరేబియా కడలి
అక్కినేని నాగచైతన్య వరుస ప్లాపుల తర్వాత “తండేల్” అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, గీత ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో మత్స్యకారుడు రాజు అనే పాత్రను పోషిస్తున్నారు నాగచైతన్య. పాకిస్తాన్ జైలులో చిత్రహింసలు ఎదుర్కొని, 13 నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో దేశభక్తితో పాటు లవ్ స్టోరీ కూడా ఉండబోతోంది. అయితే ఇప్పుడు దాదాపు ఇదే కథతో అమెజాన్ కొత్త వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది.

స్పెషల్ ఈవెంట్ ద్వారా మార్చ్ 19న తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానున్న వెబ్ సిరీస్ ల లిస్ట్ ను ప్రైమ్ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో అరేబియా కడలి కూడా ఒకటి. సత్యదేవ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. ఈ స్టోరీ విషయానికి వస్తే మత్స్యకారుల బృందం అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, విదేశీ జైలులో బంధీలవుతారు. దీంతో ఇదే స్టోరీ లైన్ తో ఇప్పటికే నాగ చైతన్య “తండేల్” అనే సినిమా తీస్తుంటే, ప్రైమ్ మళ్లీ అదే కథను ఎంచుకోవడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

లేటు చేస్తే ఎఫెక్ట్ ఘాటుగానే…
ఇక కేవలం అమెజాన్ ప్రైమ్ ఈ కొత్త అనౌన్స్మెంట్ వల్ల నాగ చైతన్య మాత్రమే కాకుండా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పటికే వరుణ్ ఒక కాటన్ ట్రేడ్ మట్కా అనే గేమ్ స్టార్ట్ చేసి మాఫియాగా ఎలా మారింది అనే కథతో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మట్కా అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పుడు దాదాపుగా ఇదే స్టోరీతో ప్రైమ్ వీడియో మట్కా కింగ్ అనే వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది. విజయ్ వర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సిరీస్ కూడా సేమ్ స్టోరీ లైన్ తో రాబోతోందని ప్రచారం జరుగుతుంది.

మరి అమెజాన్ ప్రైమ్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ఏంటో నిర్వాహకులకే తెలియాలి. లేదంటే ఆల్రెడీ అదే కథతో రూపొందుతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలకు కాస్త డిఫరెంట్ స్టోరీతో వెబ్ సిరీస్ రూపొందిస్తే సరికొత్త ట్రెండ్ కు తెర తీసినట్టుగా అవుతుందని అనుకుంటున్నారేమో. కానీ సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా ముందుగా రిలీజ్ అయ్యేదే సేఫ్ అవుతుంది. లేటుగా రిలీజ్ అయ్యే వాటికి పోలికలు పెట్టడంతో పాటు అప్పటికే అదే స్టోరీ లైన్ తో కంటెంట్ ను చూసేసి ఉంటారు. కాబట్టి ప్రేక్షకులు మళ్లీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపకపోయే ప్రమాదం ఉంది. మరి సేఫ్ జోన్ లో ఉన్నది ఎవరు? డేంజర్ జోన్ లోకి వెళ్ళబోయేది ఎవరో తెలియాలంటే ఈ రెండు సినిమాలు, వెబ్ సిరీస్ ల రిలీజ్ డేట్ లు వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు