Rajinikanth : కమల్ హాసన్ , నన్ను చూసి భయపడుతున్నారు..!

కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజినీకాంత్ ( Rajinikanth ), లోకనాయకుడిగా పేరుపొందిన కమలహాసన్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు.. కోలీవుడ్లో స్టార్ హీరోలే కాకుండా సూపర్ స్టార్ లుగా కూడా వీరు పేరు సంపాదించారు.. ఇప్పటికీ తమదైన స్టైల్ లో సినిమాలను చేస్తూ.. కుర్ర హీరోలకు దీటుగా సినిమాలను విడుదల చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. వీరిద్దరూ ఎప్పుడు కనిపించినా కూడా ఒక సెన్సేషనల్ గా ఆ సందర్భం మారుతూ ఉంటుంది. అయితే గత కొద్దిరోజులుగా రజినీకాంత్, కమలహాసన్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వైరలైన విషయం తెలిసిందే.. ఇకపోతే తాజాగా ఈ వార్తలపై రజనీకాంత్ స్పందిస్తూ.. కమలహాసన్ గురించి మాట్లాడారు.. వాటి గురించి చూద్దాం.

మీడియాకు భయపడ్డ రజినీకాంత్..

రజనీకాంత్ ( Rajinikanth ) మీడియాకు భయపడే ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చినట్లుగా తెలిపారు.. అసలు విషయం ఏమిటంటే రజనీకాంత్ తాజాగా చెన్నైలో ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లారు.. ఈ సందర్భంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లకు రజనీకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు.. అనంతరం తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి కూడా తెలియజేశారు.. గతంలో కావేరి హాస్పిటల్ ఎక్కడ అంటే కమలహాసన్ ఇంటిదగ్గర అని చెప్పేవారని.. కమల్ ఇల్లు ఎక్కడ అంటే కావేరి హాస్పిటల్ దగ్గర ఉన్నదని చెబుతున్నారు అంతలా ఆ హాస్పిటల్ పాపులారిటీ సంపాదించుకుందని వెల్లడించారు..

కమల్ హాసన్ తో విభేదాలపై క్లారిటీ..

ఇప్పుడు నేను కమల్ గురించి చెప్పానని మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని రాసుకోకండి.. నేను ఏదో కేవలం ఉదాహరణకు మాత్రమే చెప్పాను.. అసలు మీడియా వాళ్ళ ముందు నేను మాట్లాడడానికి ఈ విషయం పైన చాలా సంతోషించాను.. ఇది ఎలక్షన్ సమయం.. నేను ఏది మాట్లాడినా కూడా వారి ఇష్టానికి రాసుకుంటారు.. కెమెరాలను చూస్తూ ఉంటేనే నాకు భయం వేస్తుంది.. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా భయపడుతున్నానంటూ నవ్వేశారు రజనీకాంత్.

- Advertisement -

మీడియా వల్లే ఇదంతా..

అయితే తాను ఎన్నో చోట్ల చికిత్స చేయించుకున్నాను.. కేవలం ఇదంతా ఈ డాక్టర్లు ఉండడం వలన ఇలా హ్యాపీగా ఉంటున్నానంటూ వెల్లడించారు. ఏది ఏమైనా అటు రజినీకాంత్, ఇటు కమలహాసన్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పేశారు రజనీకాంత్.. కమలహాసన్ కూడా ఎప్పుడు రజనీకాంత్ పైన ఎలాంటి విమర్శలు కూడా ఇప్పటివరకు చేయలేదు.. కానీ మీడియాలో మాత్రం వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి ఈ క్రమంలోనే రజినీకాంత్ ఇలా కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రజనీకాంత్ చేసినటువంటి ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. జైలర్ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకున్న ఈయన తాజాగా లాల్ సలాం సినిమాలో కూడా గెస్ట్ రోల్ పోషించారు.. ఇక ఈ చిత్రానికి ఈయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు