Renu Desai : రేణూ దేశాయ్ మళ్ళీ పెళ్లి పై కొడుకు ఏమన్నాడంటే.. షాక్ లో ఇండస్ట్రీ .!

ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ ( Renu Desai ) మళ్ళీ పెళ్ళి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. అంతే కాదు ఈమె ఐదు సంవత్సరాల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఏమైందో తెలియదు కానీ పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయింది. ఈ విషయంపై ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రేణూ దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.. వీరి టార్చర్ వల్లే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదనే వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. మొన్నా మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ దేశాయ్ కూడా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చింది.

తన కూతురు ఆద్య ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంకొకరితో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మేరకు నిశ్చితార్థం చేసుకున్నానని.. అయితే పాప పెద్దదయ్యే క్రమంలో రెండవ పెళ్లి అవసరమా అనే ఆలోచన అప్పుడే వచ్చిందని.. అందుకే ఇరువురు కూర్చొని.. మళ్లీ పెళ్లి పై ఆ వరుడితో తన అభిప్రాయాన్ని వెల్లడించి సమస్యని సాల్వ్ చేసుకున్నాను అంటూ కూడా రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది అయితే ఈ విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రేణూ దేశాయ్ కొడుకు అకీరానందన్ చేసిన కామెంట్లు మాత్రం ఇఆసక్తికరంగా మారుతున్నాయి..

రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లిపై అకీరా స్పందన..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ దేశాయ్ ( Renu Desai ) తాను మళ్ళీ పెళ్లి చేసుకోవడం పై తన పిల్లలు ఏమన్నారు అన్న విషయాన్ని వెల్లడించింది.. ఆమె మాట్లాడుతూ.. ఒక సందర్భంలో నా పిల్లలే అన్నారు.. పవన్ మరో పెళ్లి చేసుకున్నప్పుడు.. మమ్మీ నువ్వు ఎందుకు సింగిల్గానే ఉంటున్నావు.. నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అకిరా నందన్ అడిగాడు.. దానికి నేను స్పందిస్తూ చేసుకుంటా బాబు.. అబ్బాయి దొరకాలి కదా అని చెప్పాను.. అయితే పవన్, నేను విడిపోయిన విషయం పవన్ తో వాళ్లు ఎప్పుడు అడగరు. అకీరా, ఆధ్యా చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు.. చిన్న పిల్లల్లా అసలు అనిపించరు.. ఇక నేను పెళ్లి చేసుకుంటే గర్వంగా దానిని ప్రకటిస్తాను.. అధికారికంగా ఈ విషయాన్ని అందరితో పంచుకుంటాను అంటూ తెలిపింది రేణు దేశాయ్.. ఇకపోతే ఈ విషయం విన్న ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.. ఇంత చిన్న వయసులోనే అకీరా నందన్ అంత మెచ్యూర్డ్ గా ఎలా ఆలోచించారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

రేణు దేశాయ్ కెరియర్..

ఇక ఇప్పటికీ ఒంటరిగానే ఉన్న ఈమె మళ్లీ కెరియర్ పై ఫోకస్ పెట్టింది.. అందులో భాగంగానే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో బలమైన క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ అలాంటి డెప్త్ ఉన్న పాత్రలు వస్తే మాత్రం నటిగా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తెలిపింది రేణూ దేశాయ్..

రేణు దేశాయ్ వ్యక్తిగత జీవితం..

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసి ఒక కొడుకుకి జన్మనిచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. ఆధ్యా పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో ఈ జంట విడిపోయారు. ఇక అప్పటినుంచి పిల్లలతో ఒంటరిగా ఉంటుంది రేణు దేశాయ్.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు తాను కమిట్ అయిన చిత్రాల షూటింగ్లలో కూడా పాల్గొంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు