Simran Net Worth : సిమ్రాన్ అసలు పేరు ఏంటో తెలుసా? ఆస్తి ఇంతేనా?

Simran Net Worth : 90-20ల కాలంలో సినీ ప్రియుల మనసుల్లో శృంగార దేవతగా తిష్ట వేసుకుని కూర్చున్న నిన్నటి తరం హీరోయిన్ సిమ్రాన్ పుట్టినరోజు నేడు. అప్పట్లో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేసిన బ్యూటీ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఉదయించింది ఉత్తరాదిని అయినప్పటికీ వెలుగొందింది మాత్రం సౌత్ సినిమాలతోనే. ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ తర్వాత ఫెయిడౌట్ కాగానే పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. సిమ్రాన్ దీపక్‌ అనే వ్యక్తిని ఆమె వివాహం చేకోగా, వీరికి ఇద్దరు కొడుకులు. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి నటనకు ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలు చేస్తోంది సిమ్రాన్. ఈరోజు ఆమె 43వ బర్త్ డే సందర్భంగా సిమ్రాన్ అసలు పేరు ఏంటి? అసలు ఆమె ఆస్తి ఎంత? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

సిమ్రాన్ అసలు పేరు ఏంటి?

1976 ఏప్రిల్ 4న ముంబైలో జన్మించింది సిమ్రాన్ ( HBD Simran ). ఆమె అసలు పేరు రిషిబాల నావల్. సినిమాల్లోకి అడుగు పెట్టాక సిమ్రాన్ గా తన పేరును మార్చేసుకుంది. టీనేజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ సనం హర్ జైట్ అనే హిందీ సినిమాలో మొదటిసారిగా హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెకు గుర్తింపునిచ్చింది మాత్రం దక్షిణాది సినిమాలే. సుమన్ హీరోగా నటించిన అబ్బాయిగారి పెళ్లి మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది సిమ్రాన్. మొదటి సినిమాతోనే అందరిని అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ సమరసింహారెడ్డి మూవీతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత ఆఫర్లు వెల్లువలా రావడంతో వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ జత కట్టింది. నందమూరి బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు గొప్పింటి అల్లుడు, సీమ సింహం, ఒక్క మగాడు వంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది. అలాగే నాగార్జునతో నువ్వు వస్తావని, బావ వచ్చాడు సినిమాల్లో రొమాన్స్ చేసింది. వెంకటేష్ తో ప్రేమతో రా, కలిసుందాం రా అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది. చిరంజీవితో కలిసి మృగరాజు, డాడీ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే చిరంజీవి హీరోగా నటించిన అన్నయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిందేసి అప్పట్లోనే భారీ పారితోషికాన్ని అందుకుంది సిమ్రాన్. హరికృష్ణతో సీతయ్య సినిమాలో, మహేష్ బాబుతో యువరాజు సినిమాలోనూ కలిసి నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించి మురిపించింది సిమ్రాన్.

సిమ్రాన్ ఆస్తులు ఇంతేనా?

తన అందం అభినయంతో నిర్మాతకు కాసుల వర్షం కురిపించిన సిమ్రాన్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. రీ ఎంట్రీలో పేట్ట సినిమాలో రజనీకాంత్ సరసన, మహాన్ మూవీలో విక్రమ్ కు జోడిగా, రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమాలో మాధవన్ తో కలిసి నటించింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సిమ్రాన్ ఆస్తుల విలువ తెలిస్తే దాదాపు దశాబ్ద కాలం పాటు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ కూడబెట్టుకుని ఇంతేనా అని అనిపిస్తుంది. సిమ్రాన్ ఆస్తుల విలువ ( Simran Net Worth ) మొత్తంగా కలిపి 60 నుంచి 80 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. దీన్ని బట్టి అప్పట్లో హీరోయిన్లకు ఎంత తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. ముంబై, చెన్నై లలో ఈ బ్యూటీకి విలాసవంతమైన బంగ్లాలు, కోయంబత్తూరులో ఒక ఫామ్ హౌస్ ఉన్నాయి. అలాగే కోటి రూపాయల విలువ చేసే డైమండ్ నెక్లెస్ లు సిమ్రాన్ ఆస్తులలో భాగమని సమాచారం. బీఎండబ్ల్యూ x5, ఆడి q7 వంటి లగ్జరీ కార్లు కూడా సిమ్రాన్ గ్యారేజీలో కొలువుదీరాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు