Weight Loss : బరువు తగ్గాలనుకుంటే ఈ తప్పులు మాత్రం చేయకండి

బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక రకాల డైట్ లను ఫాలో అవ్వడంతో పాటు వ్యాయామాలు కూడా చేస్తారు. కానీ మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. ముఖ్యంగా తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బరువును తగ్గించుకోలేరు సరికదా బలహీనత, అలసటతో అనారోగ్యం బారిన పడతారు. మరి ఇంతకీ బరువు తగ్గాలనుకువారు తెలియకుండానే చేసే ఆ మిస్టేక్స్ ఏంటి అంటే…

భోజనం చేయకుండా ఉండడం

బరువు తగ్గడానికి జనాలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సొంతంగా డైట్ ను ఫాలో అవ్వడమే కాకుండా ఇతరుల సలహాలను పాటిస్తారు. చాలాసార్లు భోజనం చేయడం మానేస్తారు. రోజుకు ఎన్ని కేలరీలు తీసుకోవాలి ? శరీరానికి ఎన్ని కేలరీలు కావాలి ? అవి ఏం చేస్తే ఎన్ని కేలరీలు కరిగిపోతాయి ? అనే కనీస అవగాహన కూడా ఉండదు. కానీ ఒక పూట భోజనం మానేస్తే చాలు అని అనుకుంటారు. ఒక్క పూట కడుపు కాల్చుకుని వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గవచ్చని భావిస్తున్నారు. కానీ ఇది మీ కండరాలు, ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలసటతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకని భోజనం మానేయడానికి బదులు డైటీషియన్ నుండి సరైన డైట్ సలహా తీసుకోవాలి.

ఓవర్ గా వ్యాయామం చేయడం

ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతామని కొందరు అనుకుంటారు. తినగానే కేలరీలను బర్న్ చేస్తే చాలు బరువు తగ్గుతామని నమ్ముతారు. కానీ ఈ పద్ధతి తప్పు. ఇలా చేస్తే కండరాలకు అవసరమైన కొవ్వు, శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ల లోపం ఏర్పడుతుంది. ఎందుకంటే మన శరీరం సరిగ్గా పని చేయడానికి కేలరీలు అవసరం.

- Advertisement -

నీళ్లతో బరువు తగ్గొచ్చా ?

చాలా మంది ఉదయాన్నే నిద్రలేచి నిమ్మరసం, జీలకర్ర నీరు, గ్రీన్ టీ లేదా వివిధ రకాల డిటాక్స్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గొచ్చు అనుకుంటారు. కానీ ఇదొక అపోహ మాత్రమే. ఎందుకంటే మీరు రోజంతా అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుని, మరునాడు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి లేదా నిమ్మకాయ నీటిని తాగడం వల్ల బరువు తగ్గలేరు. మీ శరీరానికి అనుగుణంగా సరైన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.

వ్యాయామం చేయకుండా…

ఎలాంటి వ్యాయామాలు చేయకుండా కేవలం డైట్‌తో బరువు తగ్గవచ్చని చాలా మంది అనుకుంటారు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ వ్యాయామం చేస్తే శరీరంలో శక్తి, స్టామినా పెరుగుతుంది. అలాగే క్యాలరీలను కరిగించడంలో హెల్ప్ అవుతుంది. బరువు తగ్గడంలో ఆహారం పాత్ర 80 శాతం ఉంటే, వ్యాయామం 20 శాతం ఉంటుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం కూడా చేయాలి.

వ్యాయామంతో బరువు తగ్గడం

చాలా మంది కూడా డైటింగ్ లేకుండా వ్యాయామం ద్వారానే బరువు తగ్గవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఆహారం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఏది తిన్నా అది బర్న్ అయిపోతుంది. ఒకవేళ ఎక్సట్రా కేలరీస్ శరీరంలో ఉంటే వాటిని కరిగించడానికి వ్యాయామం హెల్ప్ చేస్తుంది. అలాగే అవసరమైన పోషకాలు కూడా అందుతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు