Family Star Day 1 Collections : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీతో శుక్రవారం థియేటర్లలోకి వచ్చాడు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి పరుశురాం దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ మూట గట్టుకున్న ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన లైగర్ మూవీ కంటే ఫ్యామిలీ స్టార్ కలెక్షన్లు మరింత తక్కువగా రావడం ఆయన అభిమానులను టెన్షన్ పడుతోంది. మరి ఇంతకీ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత? అనే వివరాల్లోకి వెళ్తే…
ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్…
ఈ ఏడాది తెలుగు ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో ఫ్యామిలీ స్టార్ కూడా ఒకటి. ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచే నెగటివ్ టాక్ ను తెచ్చుకోవడం గమనార్హం. డైరెక్టర్ పరుశురాం టేకింగ్, కథ, సినిమాలోని సెంటిమెంట్, కామెడీ సీన్స్… ఇలా ఏ ఒక్క సన్నివేశాన్ని వదలకుండా సోషల్ మీడియా వేదికంగా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నెగటివ్ ఎఫెక్ట్ కారణంగానే సినిమా కలెక్షన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. ఈ మూవీ విజయ్ కెరీర్ లోనే లోయెస్ట్ కలెక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో 3 కోట్లకు పైగా కలెక్షన్లను ( Family Star Day 1 Collections ) రాబట్టిన ఫ్యామిలీ స్టార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 5.75 కోట్లు మాత్రమే రాబట్టినట్టు తెలుస్తోంది.
ఫ్యామిలీ స్టార్ కంటే లైగరే బెటర్…
ఫ్యామిలీ స్టార్ కంటే విజయ్ దేవరకొండ గత మూవీ లైగర్ కలెక్షన్ లే బెటర్ అనిపిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్ మొదటి రోజే 33 కలెక్షన్లను కొల్లగొట్టింది. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. కాబట్టి ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్లను ;లైగర్ తో పోల్చకపోవడమే బెటర్. ఫ్యామిలీ స్టార్ మూవీ లైగర్ కంటే దాదాపు 20 కోట్ల కంటే తక్కువగానే కలెక్షన్లను రాబట్టింది. మొత్తానికి ఈ మూవీ విజయ్ కెరీర్ లోనే అతి తక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. చాలాకాలంగా హిట్టు కరువైన విజయ్ దేవరకొండ ఈ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. కానీ అవి అడియాసలుగానే మిగిలిపోయాయి.
మరోవైపు నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ ను ఇంకా వెనకేసుకొస్తున్నారు. రివ్యూస్ ఒకరకంగా ఉన్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ మరొక రకంగా ఉంది అంటూ ఈ మూవీపై నెగెటివిటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ మూవీని ఇష్టపడుతున్నారు అంటూ కవర్ చేసుకుంటున్నారు. కానీ సోమవారానికి ఈ సినిమాను పూర్తిగా థియేటర్లో నుంచి ఎత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా జరుగుతుంది నెగిటివ్ ప్రచారం. లైగర్ కంటే ఈ మూవీ మరింత దారుణంగా ఉందని అంటున్నారు.
#TheFamilyStar has been owned by families and the night shows are filled with family audience ❤🔥
Book your tickets for the perfect 𝗦𝗨𝗠𝗠𝗘𝗥 𝗙𝗔𝗠𝗜𝗟𝗬 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗘𝗥 now!
🎟️ https://t.co/lBtal2ved3@TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan… pic.twitter.com/SRbMXFoSHV— Sri Venkateswara Creations (@SVC_official) April 5, 2024