Ram charan : మెగా ఫ్యామిలీ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకతే వేరని తెలిసిందే. రామ్ చరణ్ గాని, అటు ఉపాసన గాని సోషల్ మీడియాలో గాని, బయట జనాల సోసిటీలో గాని ఎంత పద్దతిగా ఉంటారో, ఫ్యామిలీ తో వెకేషన్స్ కి వెళ్ళినపుడు అంతే సరదాగా ఉంటారు. ఇక ఇప్పుడు క్లింకార ఎంట్రీ తో చరణ్ ఉపాసన జంటలో మరింత సంతోషాలు వెల్లివిరియగా, ఇప్పుడిప్పుడే జనాల మధ్యకు తీసుకువస్తున్నారు. రీసెంట్ గా తిరుమలలో ఫస్ట్ టైం క్లింకార బేబీ పిక్ రివీల్ కాగా, తాజాగా మరో సారి ఉపాసన పోస్ట్ తో వైరల్ అవుతుంది. తాజాగా ఉపాసన అప్లోడ్ చేసిన పోస్ట్ లో రామ్ చరణ్ ఏనుగు పిల్లకు స్నానం చేయిస్తుంటే క్లింకారా ఎలా చూస్తోందో అంటూ, కొణిదెల వారి అమ్మాయా మజాకానా! చాలా గమ్మత్తయిన దృశ్యమిది, అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వెకేషన్ లో ఏనుగుపిల్ల తో చరణ్ ఫ్యామిలీ..
గేమ్ ఛేంజర్ షూటింగ్ నుండి కాస్త విరామం తీసుకున్న రామ్ చరణ్(Ram charan) తాజాగా భార్య ఉపాసన, అలాగే కూతురు క్లిన్ కారాతో కలిసి థాయిలాండ్ లో సముయ్ లోని ఏనుగు రెస్క్యూ క్యాంపును సందర్శించారు. వీరంతా ఇప్పుడు థాయ్‌లాండ్‌లోని కో సముయ్‌లో విహారయాత్రలో ఉన్నారు. ఈ జంట తాజాగా వారి కుమార్తె క్లిన్ కారా, అలాగేపెట్ డాగ్ రైమ్‌తో కలిసి విహారయాత్రలో ఉన్నారు. ఇన్ స్టాలో యాత్రకు సంబంధించిన ఫోటోలను ఉపాసన చరణ్ షేర్ చేసారు. ఒక ఫోటోలో కుక్కపిల్ల సముద్రంలో ఈత కొట్టడం కనిపిస్తుంది. ఒక ఫోటోలో ఏనుగు రెస్క్యూ క్యాంప్‌లో రామ్ చరణ్, ఉపాసన, క్లింకార తో కలిసి పిల్ల ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. ఇక ఈ విషయాన్నీ క్లింకార మాటగా ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో మిస్టర్ సి నాన్న అద్భుతమైన అనుభవాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఏనుగు రెస్క్యూ క్యాంపులో చాలా నేర్చుకున్నా.. అంటూ పిక్ తో పాటు పోస్ట్ చేసారు. ఇక గత వారం, వారం ఉపాసన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి వారి స్నేహితులతో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసారు.
ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే..
రామ్ చరణ్ వెకేషన్ పూర్తయ్యాక శంకర్‌తో గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ లో చరణ్ పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, అంజలి, జయరామ్, సునీల్, నవీన్ చంద్ర మరియు సముద్రఖని తదితరులు నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. మేకర్స్ రీసెంట్ గా ఈ చిత్రం నుండి జరగండి అనే మొదటి సింగిల్‌ను విడుదల చేయగా, దానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇదే గాక రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనాతో విలేజ్ నేపథ్యంలో స్పోర్స్ డ్రామాలోను నటిస్తున్నారు. అలాగే సుకుమార్‌తో రెండో సినిమాలో రామ్ చరణ్ నటించనున్నాడు. ఇటీవలే అధికారికంగా ఈ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ప్రకటించబోతున్నారు.