Kollywood : రాజకీయాల్లోకి స్టార్ హీరోయిన్

హీరోయిన్ త్రిష.. దక్షిణాదిలో సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. త్రిష మిస్ చెన్నై పోటీలో గెలిచిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, కింగ్, బాడీగార్డ్, బంగారం, స్టాలిన్, లయన్ వంటి చిత్రాల్లో నటించింది. వీటితో స్టార్ హీరోయిన్ గా మారిన త్రిష.. నాయకి సినిమా తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. త్రిష తమిళం వరుసగా సినిమాలు చేస్తుంది.

త్రిష ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పెన్నియన్ సెల్వన్ 1 లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇది ఇలా ఉండగా, నిన్నటి నుండి త్రిష పేరు దక్షిణాదిలో ఎక్కువ వినిపిస్తుంది. రాజకీయాల్లోకి రావాలని త్రిష నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. తమిళ స్టార్ హీరో విజయ్ సూచనతో త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేసి, ప్రజా సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

39 ఏళ్ల ఈ తమిళ భామ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినపిస్తున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ పెద్దలు, త్రిష మధ్య దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు సమాచారం అందుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్రిష కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత చేకూరుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు