Jr NTR: జిమ్ ట్రైనర్ బర్త్ డేకు సర్ప్రైజ్… స్వయంగా కేక్ తిన్పించిన ఎన్టీఆర్

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చేసిన ఓ పనిని చూసి అభిమానులు తెగ ముచ్చట పడిపోతున్నారు. తాజాగా బయట కొచ్చిన ఫోటోలో తారక్ తన జిమ్ ట్రైనర్ బర్త్ డేను సెలబ్రేట్ చేస్తూ కనిపించారు. మరి ఆ బర్త్ డే విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం?

జిమ్ ట్రైనర్ బర్త్ డేను గుర్తు పెట్టుకుని…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్రస్తుతం ఇటు దేవర అటు వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలో వార్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే ముంబై చేరిన ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి అక్కడ పలు యాక్షన్ సన్నివేశాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పర్సనల్ ట్రైనర్ మన్నవ కుమార్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన ఫోటో బయటకు వచ్చింది. మన్నవ కుమార్ స్వయంగా తారక్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తన బర్త్ డే స్పెషల్ డేగా ఎలా మారిందో వెల్లడించారు.

తారక్ తనపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు చెబుతూనే, తన పుట్టిన రోజును గుర్తు పెట్టుకుని మరీ కేక్ తీసుకొచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంత పెద్ద స్టార్ తనను ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేయడం, ఇంతగా ప్రేమను చూపించడం అనేది మామూలు విషయం కాదని తన పోస్ట్ లో రాస్కొచ్చారు మన్నవ కుమార్ అంతేకాకుండా ఎన్టీఆర్ వినయం, విధేయతకు మారుపేరు లాంటి వారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తమ మధ్య ఉన్న ఈ బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆయన కేక్ తినిపిస్తున్న పిక్ ను షేర్ చేశారు మన్నవ కుమార్.

- Advertisement -

రియల్ హీరో…

కాగా మన్నవ కుమార్ చాలా కాలం నుంచి ఎన్టీఆర్ కు పర్సనల్ జిమ్ ట్రైనర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ను దేవర, వార్ 2 మేకోవర్ కోసం కండలు తిరిగేలా ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేసింది కూడా ఆయనే. మొత్తానికి ఈ ఫోటో ద్వారా ఎన్టీఆర్ తన పర్సనల్ వర్కర్స్ తో ఎలా ఉంటారు అనే విషయం బయట పడింది. దీంతో తారక్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్టార్ అంటే ఇలా ఉండాలి అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో బయటకు వచ్చాక మన్నవ కుమార్ కు తారక్ ఫ్యాన్స్ నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

తారక్ రంగంలోకి దిగితే..

ఇక ముంబైలో ఎన్టీఆర్ ప్రొఫెషనలిజమ్ చూసి తెగ ఆశ్చర్యపోతున్నారట మేకర్స్. అయాన్ ముఖర్జీ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ జిమ్ లో పడుతున్న కష్టం, స్వయంగా డైలాగులు చెప్పడానికి ఆయన హిందీని మరింత బాగా నేర్చుకోవడం చూసి తెగ మురిసిపోతున్నారట. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ బాలీవుడ్ అభిమానుల మనసుల్లో కూడా పక్కాగా బాగా వేసేలా కనిపిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు