Siddharth Roy OTT Release Date : సిద్ధార్థ్ రాయ్ ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Siddharth Roy OTT Release Date : బోల్డ్ సీన్లు ఉన్న ట్రైలర్ తో రిలీజ్ కి ముందే భారీ హైప్ పెంచేసిన మూవీ సిద్ధార్థ్ రాయ్. తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. మరి సిద్ధార్థ్ రాయ్ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు? అంటే…

సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అతడు మూవీతో పాటు పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దీపక్ సరోజ్ సిద్ధార్థ్ రాయ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ట్రైలర్ తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు. ఫిబ్రవరి 23న బోల్డ్ సీన్లతో అంచనాలు పెంచేసిన సిద్ధార్థ్ రాయ్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ గురించి తాజాగా ఆహా అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చింది. మే 3న ఆహాలో సిద్ధార్థ్ రాయ్ స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. పేరు సిద్ధార్థ్ రాయ్. ఈ క్లిష్టమైన మనిషిని చూడడానికి రెడీగా ఉండండి. సిద్ధార్థ్ రాయ్ మే 3న ప్రీమియర్ కానుంది అంటూ ఆహా ఈరోజు ట్వీట్ చేసింది.

70 రోజుల తర్వాత ఓటీటీలోకి..

మొత్తానికి సిద్ధార్థ్ రాయ్ థియేటర్లలో రిలీజ్ అయిన 70 రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. నిజానికి ఈ మూవీని మార్చ్ లోనే స్ట్రిమింగ్ చేస్తారని టాక్ నడిచింది. సమస్య ఏంటో తెలీదు గానీ సిద్ధార్థ్ రాయ్ ఓటిటి స్ట్రిమింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీని మే 3న ఆహలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

- Advertisement -

అర్జున్ రెడ్డి కాపీ అంటూ విమర్శలు…

వి యశస్వి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బోల్డ్ మూవీలో దీపక్ సరోజ్  హీరోగా నటించగా, తన్వి నేగి హీరోయిన్ గా కనిపించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై ప్రదీప్ పూడి, సుధాకర్, జయ అడపాక ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. రథన్ సంగీతం అందించారు. ఈ సినిమా బోల్డ్ టీజర్, ట్రైలర్ మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. కానీ ట్రైలర్ లోని బోల్డ్  సన్నివేశాలు, డైలాగులు, హీరో క్యారెక్టర్జేషన్ మొత్తం అర్జున్ రెడ్డిని మక్కికి మక్కిగా దింపినట్టు ఉందంటూ విమర్శలు వచ్చాయి. మేకర్స్ మాత్రం సిద్ధార్థ్ రాయ్ మూవీ అర్జున్ రెడ్డి రెండూ డిఫరెంట్ సినిమాలని, థియేటర్లలో మూవీని చూశాక అర్థమవుతుంది అంటూ కవర్ చేస్తూ వచ్చారు. కానీ మూవీకి పెద్దగా థియేటర్లలో ఆశించిన ఆదరణ దక్కలేదు.

సిద్ధార్థ్ రాయ్ స్టోరీ…

ఇతరుల ఎమోషన్లను పట్టించుకోకుండా తన కోరికలు మాత్రమే తీర్చుకోవడానికి ఇష్టపడే సిద్ధార్థ్ లైఫ్ లోకి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఆమెను ప్రేమించిన తర్వాత సిద్ధార్థ రాయ్ జీవితం ఎలా మారింది? వీళ్ళిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది అన్నదే స్టోరీ. ఈ మూవీని చూడాలి అనుకునే వారు మే 3న ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు