Vijay Devarakonda : సీమ యాస సింక్ అవుతుందా.?

Vijay Devarakonda:నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తనకంటూ ఒక రకమైన గుర్తింపును సాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకుడుగా పరిచయమైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి అనే పాత్రలో కనిపించాడు. అయితే ఆ రిషి అనే పాత్ర విజయ్ దేవరకొండకు మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. కేవలం పేరును మాత్రమే కాకుండా మంచి అవకాశాలను కూడా తీసుకొచ్చి పెట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

తరుణ్ భాస్కర్ తీసిన ఈ సినిమా చాలామందికి బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో లాంగ్వేజ్ కూడా తెలంగాణ నేపథ్యంలో ఉండటం వలన చాలామందికి కొత్తగా అనిపించింది. ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించి, విజయ్ ని ఒక స్టార్ హీరోని చేసిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో విజయ్ డైలాగ్స్ డెలివరీ అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. సందీప్ రెడ్డివంగా ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కూడా తెలంగాణ లాంగ్వేజ్ అనేది వినిపిస్తుంది. ఇకపోతే లాంగ్వేజ్ కి సంబంధించిన విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాము అంటే సరికొత్తగా విజయ్ ఇప్పుడు సీమయాసలో మాట్లాడబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

టాక్సీవాలా సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు రాహుల్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత శ్యాం సింగ రాయ్ అనే సినిమాను తెరకెక్కించాడు. నాని నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇక ప్రస్తుతం రాహుల్ సీమ నేపథ్యంలో ఒక సినిమాను చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో విజయ్ కంప్లీట్ గా సీమయాసలో మాట్లాడబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

ఇప్పటివరకు తెలంగాణ యాస తప్ప మిగతా యాస మాట్లాడని విజయ్ సీమయాసలో ఎలా మాట్లాడుతాడు అనే క్యూరియాసిటీ చాలామందికి కలుగుతుంది.ఇకపోతే రాజావారు రాణి గారు సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు రవి కిరణ్ కోలా. రవి కిరణ్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నట్లు కూడా సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. విజయ్ నటించిన లేటెస్ట్ ఫిలిం ఫ్యామిలీ స్టార్ ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు