Chatrapathi Child Artist: సూరీడు ఇప్పుడు ఎలా వున్నాడో చూస్తే షాక్..!

Chatrapathi Child Artist.. దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు అందించిన అతి గొప్ప చిత్రాలలో ఛత్రపతి చిత్రం కూడా ఒకటి.. ప్రభాస్ హీరోగా, శ్రియా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఇది.. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాలోని ప్రతి పాత్ర కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా అంత అద్భుతంగా రాజమౌళి తీర్చిదిద్దారు. ఛత్రపతి సినిమాలో సూరీడు అనే కుర్రాడు పాత్ర ఎంత అద్భుతంగా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుందో చెప్పాల్సిన పనిలేదు. మొత్తం ఈ కుర్రాడి వల్లే కథ టర్న్ అవుతుంది. అమాయకంగా కనిపిస్తూనే.. మంచి నటన కనబరుస్తూ.. మెప్పించిన చిన్నారి పేరు భశ్వంత్ వంశీ..

Chatrapathi Child Artist: Shocking to see how Sooridu is now..!
Chatrapathi Child Artist: Shocking to see how Sooridu is now..!

ఛత్రపతి సూరీడు భశ్వంత్ వంశీ..

ఇందులో అనితా చౌదరికి కొడుకుగా ఛత్రపతి సినిమాలో సూరీడు పాత్రలో కనిపించారు.. అయితే ఈ సినిమాలో కనిపించింది కొద్ది సమయమే అయినా ఆ పాత్ర గురించి అందరూ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే ఆ పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో రాజమౌళి ఎంతో చక్కగా చిత్రీకరించారో చెప్పక్కర్లేదు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో నటీనటుల ఎంపిక చేస్తున్నప్పుడు సూరీడు పాత్ర ఆడిషన్స్ కోసం భశ్వంత్ వంశీ వచ్చారట. మొదటిసారి ఈయనను చూడగానే సూరీడు పాత్రకు ఖచ్చితంగా సెట్ అవుతాడంటూ రాజమౌళి నమ్మకం పెట్టుకొని మరీ ఎంపిక చేశారు.. అయితే ఏమాత్రం రాజమౌళి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా..తనను నమ్మి రాజమౌళి తీసుకున్నందుకు అదే స్థాయిలో మెప్పించారు భశ్వంత్ వంశీ..

హీరో లా భశ్వంత్ వంశీ..

ఇక అలా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి సినిమా చరిత్ర ఉన్నంతకాలం తన పాత్రతో చిరస్థాయిగా నిలిచిపోయారు భశ్వంత్ వంశీ.. దాదాపు 18 సంవత్సరాల తర్వాత కనిపించాడు. అప్పుడు చిన్న పిల్లాడిలా అమాయకంగా కనిపించిన ఈయన.. ఇప్పుడు మీసాలు, గడ్డం పెంచి హీరో రేంజ్ లో ఉన్నాడు.. తాజాగా ఆన్ స్క్రీన్ తల్లి అనిత చౌదరితో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇది కాస్త చాలా వైరల్ గా మారుతోంది.ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ జూనియర్ ప్రభాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. అంతేకాదు త్వరలో హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ.. అప్పుడే నెటిజన్స్ భవిష్యవాణి చెప్పేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

హీరోగా ప్రయత్నాలు..

భశ్వంత్ వంశీ ప్రస్తుతం 26 సంవత్సరాల వయసులోకి వచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎక్కువగా సినిమాలు చేయలేదు.. విదేశాల్లో చదువును పూర్తి చేసుకుని ఇటీవలే టాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. మంచి పాత్రతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే మంచి మంచి కథలను వింటూ తన కెరీర్ కు ఉపయోగపడే కథలను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు భశ్వంత్ వంశీ…. ఇక ప్రస్తుతం ఈయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో కచ్చితంగా దర్శకుల దృష్టిలో పడి హీరోగా అవకాశాలు వస్తాయంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి భశ్వంత్ వంశీ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు