Pawan Kalyan.. టాలీవుడ్ లో మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటి సంపాదించారు హీరో పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అలాంటి వారిలో డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఒకరు.. మరొకరు నిర్మాత శరత్ మరార్.. త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ కళ్యాణ్ నటించే ప్రతి సినిమాలో కూడా తన మేనరిజాన్ని చూపించడమే కాకుండా.. పాలిటిక్స్ లో కూడా రియల్ హీరోని చేయడానికి త్రివిక్రమ్ తన మాటల్ని కూడా ఎన్నోసార్లు అందించారని వార్తలు వినిపించాయి.
పవన్ కళ్యాణ్ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు..
పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయంలో కూడా అప్పుడప్పుడు త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారని సమాచారం. నిర్మాత శరత్ మురార్ తో కూడా పవన్ కు మంచి అనుబంధం ఉన్నది.. వాస్తవానికి పవన్ తో సినిమా అంటే కచ్చితంగా నిర్మాతలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే టాక్ ఉన్నది.. పవన్ పొలిటికల్ పరంగా ఉండడం వల్ల డేట్లు అడ్జస్ట్ కాక నిర్మాణం ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. పవన్ తో సినిమా అంటే కొన్నేళ్ల పాటు పడుతుందనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉంటాయి.
పవన్ చేతిలో తిట్లు తిన్న త్రివిక్రమ్..
అయితే పవన్ కళ్యాణ్ తో రిపీటెడ్ గా సినిమాలు చేస్తున్నటువంటి శరత్ మరార్.. ఇప్పటి వరకు గోపాల గోపాల, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలలో కూడా ఇన్వాల్వ్ అయ్యేంత స్నేహబంధం వీరిద్దరి మధ్య ఉన్నది.. తాజాగా పవన్ కళ్యాణ్ పైన శరత్ మరార్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టడని డబ్బు విషయంలో ఆయన లాంటి వ్యక్తిని ఇప్పటివరకు తాను చూడలేదంటూ కూడా వెల్లడించారు శరత్ మరార్. ముఖ్యంగా డబ్బు విషయంలో ఒకానొక సమయంలో ఆయనకి ఒక సలహా ఇచ్చామని ఆ సలహాతో అటు త్రివిక్రమ్..ఇటు తాను తిట్లు తిన్నట్లు వెల్లడించారు.
డబ్బుపై వ్యామోహం లేదు..
పవన్ కళ్యాణ్ కి డబ్బు పైన అసలు ఆశ అనేది ఉండదని.. ముఖ్యంగా డబ్బు తీసుకునే విషయంలో ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని త్రివిక్రమ్, తాను ఎన్నో సార్లు సూచించామంటూ తెలిపారు శరత్.. ముఖ్యంగా పిల్లలు ఉన్నారని చెబుతూనే ఉంటాము అప్పుడు కూడా మాకు క్లాస్ పీకుతూ ఉంటారు.. నాకు ఏం చేయాలో తెలుసు.. మీ టీచింగ్ అవసరం లేదని తన పిల్లలని ఎలా లీడ్ చేసుకోవాలో తనకు బాగా తెలుసు అని కూడా తెలుపుతారని తెలిపారు శరత్ మరార్.
పనిమనిషి భర్తకు చుక్కలు చూపించిన పవన్..
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ డబ్బు ఆదా చేయడంలో చాలా వీక్ పర్సన్ అని.. కానీ ఆయన డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఎప్పుడూ పడలేదని కూడా తెలిపారు.. పవన్ కళ్యాణ్ సహాయం పొందిన వారు చాలామంది ఉన్నారు.. తన ఇంట్లో పని చేసే వ్యక్తి తన భార్య మంగళ సూత్రాన్ని అమ్మేసి మరీ పేకాట ఆడుతూ ఉంటే ఆ విషయాన్ని ఆయన భార్య పవన్ దగ్గరకి వచ్చి ఏడుస్తూ చొప్పగా పవన్ కళ్యాణ్ కోపాన్ని ఆరోజు చూశాను అంటూ వెల్లడించారు శరత్.. ఆ వెంటనే ఆమెకు ధైర్యం చెప్పి ఆర్థికంగా కొంత డబ్బును ఇచ్చి.. తన భర్తకు భయాన్ని చూపించారని తెలిపారు శరత్ మరార్.