Triple Roles in tollywood.. ఈ తరం హీరోలలో చాలామంది ఒక సినిమాలో ఒక పాత్ర మాత్రమే చేస్తున్నారు.. అయితే అక్కడక్కడ కొంతమంది హీరోలు ద్విపాత్రిభినయం చేస్తూ మెప్పిస్తున్నారు.. కానీ ఆ కాలంలో హీరోలు తాము నటించే సినిమాలలో ఐదారు పాత్రలలో కూడా నటించి మెప్పించేవారు . ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోలకి అలా ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించడం అంటే చాలా ఇష్టం. నిజానికి ఇది చాలా సాహసంతో కూడుకున్న పనైనా కూడా ఎంతో ఇష్టంతో చేస్తూ ఉంటారు.. అయితే ఇక్కడ ద్విపాత్రాభినయం కాకుండా త్రిపాత్రాభినయం చేసి మెప్పించిన హీరోల గురించి ఇప్పుడు చూద్దాం..
అక్కినేని నాగేశ్వరరావు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మూల స్తంభం అయిన అక్కినేని నాగేశ్వరరావు.. నవరాత్రి చిత్రంలో ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు.. ఇలా అన్ని పాత్రలు పోషించి అప్పట్లోనే రికార్డు సృష్టించారు అక్కినేని. ఇక ఇదే సినిమాని శివాజీ గణేషన్ తమిళ్లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే..
కమల్ హాసన్:
ఈ సినిమా స్ఫూర్తితో కమల్ హాసన్ దశావతారం.. సినిమాలో ఏకంగా 10 పాత్రలు పోషించి మెప్పించారు అంతేకాదు అప్పటివరకు అక్కినేని, శివాజీ గణేషన్ పేరు మీద ఉన్న రికార్డ్లను కూడా అధిగమించారు కమల్ హాసన్.
నందమూరి తారక రామారావు..
స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా 1977లో దానవీరశూరకర్ణ సినిమా చేశారు. అందులో మూడు పాత్రలు పోషించి సంచలనం సృష్టించారు. ఇందులో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలో నటించారు. మూడు క్లిష్టమైన పాత్రలే అయినా తన అద్భుతమైన నటనతో మెప్పించారు ఎన్టీఆర్.. అంతే కాదు ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఆయనే వహించారు.. అలాగే ఎన్టీఆర్ విరాటపర్వం చిత్రంలో కూడా ఏకంగా ఐదు పాత్రలు పోషించారు. ఇందులో కీచకుడు, అర్జునుడు, బృహన్నల, కృష్ణుడు, దుర్యోధనుడు పాత్రలు పోషించారు..
సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ కూడా కుమార రాజా చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు.. అంతేకాదు ఇలా త్రిపాత్రాభినయం ఏకంగా ఏడుసార్లు ఏడు సినిమాలలో నటించి రికార్డు సృష్టించారు..
చిరంజీవి:
చిరంజీవి కూడా ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో మూడు పాత్రలు చేసి మెప్పించారు.
ఎన్టీఆర్:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జై లవకుశ చిత్రంలో మూడు పాత్రలు చేసి మెప్పించారు..ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
కళ్యాణ్ రామ్:
హీరో కళ్యాణ్ రామ్ కూడా అమిగోస్ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.
ఇక వీరే కాకుండా మరికొంతమంది హీరోలు త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇలా మూడు పాత్రలో నటించి మెప్పించడం ఆనాటి హీరోలకే సాధ్యమైంది కానీ ఈ కాలం హీరోలలో ఎవరు కూడా ఇన్ని పాత్రలు పోషించలేదు.. చేస్తే ద్విపాత్రాభినయంతోనే మెప్పిస్తూ ఉండడం గమనార్హం. మరి ఇకనైనా ఇలా అనేక పాత్రలతో హీరోలు ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి.