90’s Web Series..గతంలో ఎవరైనా సరే స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తే వారికి మంచి క్రేజ్ వస్తూ ఉండేది.. కానీ ప్రస్తుతమున్న పరిస్థితులలో మాత్రం చిన్న చిన్న సినిమాలలో.. అందులోనూ ఓటీటీలలో నటిస్తేనే మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఓటీటీ లు వచ్చినప్పటి నుంచి చాలామంది సెలబ్రిటీలుగా మారారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు కూడా మరింత స్టార్డం వచ్చేలా చేస్తున్నాయి ఈ వెబ్ సిరీస్.. మరోవైపు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్లలో 90′ స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
90’స్ వెబ్ సిరీస్ లో మెరిసిన స్నేహల్..
90’స్ వెబ్ సిరీస్ అలనాటి హీరో శివాజీ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో ప్రముఖ యూట్యూబర్ మౌళి కూడా నటించారు.. వీరితోపాటు దివ్య రోషన్ రామ్ కూడా నటించడం జరిగింది. వీరందరి మధ్య జరిగేటువంటి కామెడీ సన్ని వేషాలు ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా ఉన్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటించిన అమ్మాయి గుర్తుందా.. ముఖ్యంగా శివాజీ కొడుకు లవ్ చేసే అమ్మాయిగా. ఈ వెబ్ సిరీస్ లో చాలా తక్కువగానే కనిపించడం జరిగింది.
గ్లామర్ డోర్స్ పెంచిన స్నేహల్ కామత్..
అయితే ఉన్నంతసేపు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈమె ఎలా ఉంది అని అభిమానులు సైతం గూగుల్లో తెగ వెతికేస్తూ ఉండగా.. ఈ అమ్మాయి పేరు స్నేహల్ కామత్.. ఈ ముద్దుగుమ్మ 90స్ వెబ్ సిరీస్ లోకి రాకముందే పలు చిత్రాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో కూడా నటించిందట. అలాగే త్వరలో రాబోతున్న 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ సీజన్-2 లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉండే స్నేహల్.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఈమె అందానికి ఫ్యాన్స్ కూడా ఫిదా..
ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు 90స్ వెబ్ సిరీస్ లో చిన్న పిల్లలా కనిపించిన స్నేహల్.. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన అందాల చందాలతో కవ్విస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. మరి ఇలాంటి క్రేజ్ తోనే రాబోయే రోజుల్లో సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించే అవకాశం ఉంటుందేమో చూడాలి మరి. ఇకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్లుగా నొప్పిస్తున్న విషయం తెలిసింది స్నేహం కూడా త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ అభిమానులు చెబుతున్నారు.. ఏది ఏమైనా ఈ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన ఈమె హీరోయిన్ అయితే ఎలా మెప్పిస్తుందో చూడాలి.
View this post on Instagram