Kannappa Shooting Update : మంచు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబం తమ పరువు నిలబెట్టుకోవడమే కాకుండా, మంచు విష్ణుకు ఓ భారీ హిట్ ఇవ్వాలని చూస్తుంది. అందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటున్నారు. మంచు కుటుంబానికి ఉన్న పరిచయాలతో ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరోను తీసుకొస్తున్నారు.
ఇటీవల బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కన్నప్ప సెట్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శివుడి పాత్ర పోషిస్తున్నాడు. కొద్ది రోజులు టైం కేటాయించి, తన పాత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు అక్షయ్ కుమార్. ఇప్పుడు నందీశ్వరుడి పాత్రపై షూటింగ్ జరుగుతుంది. ఈ కన్నప్ప సినిమాలో నందీశ్వరుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
నందీశ్వరుడి పాత్ర షూటింగ్ కోసం ప్రభాస్… మంచు కుటుంబానికి టైం కేటాయించాడు. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లోని రామోజీ రావు ఫిల్మీ సిటీలో ప్రభాస్ పై షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 13 వరకు ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రభాస్ పార్ట్ షూటింగ్ పూర్తి అయితే, కన్నప్ప షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టే. దీని తర్వాత మంచు ఫ్యామిలీ పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.
భారీ బడ్జెట్ తో వస్తున్న చిత్రం కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది.