Khushi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 80స్ లో దేశం మొత్తం ఊపేసిన ఈమె, తాను ఉండగానే తన ఇద్దరు కుమార్తెలను భర్త బోణి కపూర్ తో కలిసి ఇండస్ట్రీ కి పరిచయం చేసింది. ఇక ఆమె లేని లోటు ఇప్పుడు జాన్వీ కపూర్ తీరుస్తుందని అనిపిస్తుంది. తల్లికి ఏమాత్రం తగ్గినట్టు జాన్వీ కపూర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లో ధఢక్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఆశించిన సక్సెస్ అక్కడ దక్కలేదు. అందుకే తెలుగు ఇండస్ట్రీ ని నమ్ముకుంది. ఇక్కడ ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు శ్రీదేవి అందానికి, నటనకు జాన్వీ కపూర్ మాత్రమే వారసురాలు అని అంతా భావించారు. జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫోటోల గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి. అందాల ఆరబోత విషయంలో జాన్వీ కపూర్ హద్దులు దాటేసింది. అయితే తాజాగా ఈ అందాల విందులో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ అక్క జాన్వీ ని మించిపోతుంది. మొన్నటి వరకు అక్క తర్వాతే ఖుషి అని అంతా అనుకున్నారు. కానీ తాజా ఫోటో షూట్ తో వాటికి చెక్ పెట్టింది.
అక్కని మించిన చెల్లి..
అయితే గ్లామర్ విషయంలో ఫోటోషూట్ లతో తన అందాల ఆరబోతతో అక్క అందం కంటే ఎక్కువే తన అందం అంటూ నిరూపించుకునే విధంగా బ్లాక్ ఔట్ ఫిట్ లో మెరిసింది. తన క్లీవేజ్ షో అందంతో పాటు కవ్వించే చూపులతో కెమెరాకు ఫోజ్ ఇచ్చిన ముద్దుగుమ్మ ఖుషి కపూర్ కి నెట్టింట మంచి ఫాలోయింగ్ క్రియేట్ అవుతుంది. ఇన్నాళ్లు జాన్వీ కపూర్ అందం ను ఆహా ఓహో అంటూ పొగుడుతూ వచ్చిన శ్రీదేవి ఫ్యాన్స్ కి ఇప్పుడు ఖుషి కపూర్ అందం మతి పోగొడుతుంది. ఇప్పటికే ఖుషీ కపూర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. వరుసగా సినిమాలు చేయకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో నటిస్తోంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ తాజా ఫోటో షూట్ తో నిరూపితం అయ్యింది కనుక టాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఇక జాన్వీ కపూర్ చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో ల్యాండ్ అయ్యింది. వచ్చి రావడంతో నే ఎన్టీఆర్ కి జోడీగా దేవర సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. దేవర విడుదలకు ముందే చరణ్ కు జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో నటించబోతుంది.
వరుస ఛాన్సులతో ఖుషి?
ఇక తన గ్లామర్ షో తో సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న ఖుషి కపూర్ (Khushi Kapoor) సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఆఫర్లు అందుకుంటుంది. ఆల్రెడీ ది ఆర్చీస్ అనే సినిమాలో నటిస్తుంది ఖుషి కపూర్. బాలీవుడ్ సెలబ్రిటీ కిడ్స్ నటిస్తున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో త్వరలో రిలీజ్ కానుంది. ఇక త్వరలో బాలీవుడ్ లోనే ఓ బడా సినిమాలో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే బోని కపూర్ ఖుషి కపూర్ ని తెలుగులో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. జాన్వీ కపూర్ లాగే ఖుషి ని కూడా ఓ బడా తెలుగు సినిమాలో నటింపచేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఖుషి కపూర్ నటించబోతున్న మొదటి తెలుగు సినిమా ఏ హీరోతో అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి.