Happy Birthday Raj Tarun: ఇప్పుడైనా సరిగ్గా ప్లాన్ చేసుకో బ్రో

Happy Birthday Raj Tarun: రాజ్ తరుణ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తోనే మంచి గుర్తింపును సాధించుకొని 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో కూడా దొరికాడు అని అనిపించుకున్నాడు. ఒక విలేజ్ ఫ్యామిలీ లవ్ స్టోరీ ని అద్భుతంగా తీశాడు దర్శకుడు విరించి వర్మ. ఈ సినిమాలోని గోదావరి అందాలని బావ మరదళ్ల మధ్య అనుబంధాల్ని అద్భుతంగా ప్రజెంట్ చేసి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు.

ఇకపోతే ఈ సినిమా తర్వాత చేసిన సినిమా “సినిమా చూపిస్తా మామ” ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రసన్న కుమార్ రాసిన ఈ కథను త్రినాధరావు నక్కిన అద్భుతంగా తెరకెక్కించి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాడు. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ణి వెతుక్కుంటూ వరుస అవకాశాలు వచ్చాయి.

సుకుమార్ శిష్యుల్లో ఒక్కడైన సూర్య ప్రతాప్ పల్నాటి కుమారి 21ఎఫ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు సుకుమార్ కథను అందించాడు. రాజ్ తరుణ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి సంబంధించి అన్ని అంశాలు బాగా కలిసి వచ్చాయని చెప్పొచ్చు. సుకుమార్ ఈ కథను రాసిన విధానం. సూర్య ప్రతాప్ తీసిన విధానం. అలానే నటీనటులు పెర్ఫార్మన్స్ ఇవన్నీ కూడా ఈ సినిమాను హిట్టు దిశగా మలిచాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ కెరియర్ లో ఇప్పటివరకు కూడా చెప్పుకోదగ్గ హిట్ సినిమా అయితే రాలేదు.

- Advertisement -

రాజ్ తరుణ్ చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూనే వచ్చింది. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడో రకం ఆడోరకం, మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రంగుల రాట్నం ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఇక రాజ్ తరుణ్ మార్కెట్ ఆల్మోస్ట్ పడిపోయింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం మళ్ళీ మంచి కథలను ఎన్నుకొని తనను తాను ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవచ్చు.

ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా భలే ఉన్నాడే. ఈ సినిమాను మారుతి ప్రజెంట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా వర్కౌట్ మళ్లీ మరిన్ని అవకాశాలను రాజ్ తరుణ్ కి తీసుకురావాలని ఫిల్మిఫై తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు