Pawan Kalyan : గబ్బర్ సింగ్‌ మూవీని పవన్ కళ్యాణ్ ఫస్ట్ రిజెక్ట్ చేశాడా… టైటిల్‌కి అదే కథ… అసలేమైంది అంటే..?

Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం గబ్బర్ సింగ్.. ఈ సినిమా విడుదల అయ్యి 12 సంవత్సరాలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన చిత్రాలలో గబ్బర్ సింగ్ కూడా ఒకటి.. 2012లో మే 11న విడుదలై.. మండుటెండలో కలెక్షన్ ల వర్షం కురిపించింది. అయితే మొదట ఈ సినిమాలో నటించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించలేదు.. కానీ ఒక సినిమాను ఇన్స్పైర్ గా తీసుకొని.. మళ్ళీ ఈ సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు.. మరి సడెన్ గా ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి? తెర వెనుక నిజాలు గురించి తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు.

Pawan Kalyan : Did Pawan Kalyan first reject the movie Gabbar Singh... The same story as the title... Does that mean it's original..?
Pawan Kalyan : Did Pawan Kalyan first reject the movie Gabbar Singh… The same story as the title… Does that mean it’s original..?

గబ్బర్ సింగ్.. అందుకే ఒప్పుకున్నా..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గబ్బర్ సింగ్ సినిమాను తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది.. దబాంగ్ ను రీమేక్ చేస్తే బాగుంటుంది అంటూ.. ఆ చిత్రం విడుదలైన మూడు నెలల తర్వాత నాకు చూపించారు.. అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా చేయగలనో అర్థం కాక ఒప్పుకోలేదు.. ఈ సినిమా కథ మొత్తం సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది.. చాలా సినిమాలో చూపించినట్టు ఇందులో కూడా తల్లి , కొడుకు కథ కదా.. అందుకే చేయలేను అనుకున్నాను.. కానీ కొన్ని రోజులు తనకి తక్కువ బడ్జెట్లో.. అతి తక్కువ సమయంలో పూర్తయ్యే ఒక చిత్రం చేయాలనుకున్నాను అదే సమయంలో దబాంగ్ కూడా గుర్తొచ్చి మళ్ళీ చూశాను.. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేశాను… ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధత తో ఉంటాడు.. కానీ వ్యవహార శైలి, డ్రెస్సింగ్ స్టైల్ చాలా విభిన్నంగా వుంటాయి. గుడుంబా శంకర్ లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీసు పాత్రను ఇందుకు స్ఫూర్తిగా తీసుకున్నానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్..

గబ్బర్ సింగ్ పేరు పెట్టడానికి ఆయనే స్ఫూర్తి..

ఇకపోతే మొదట ఈ సినిమాలో నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు.. అందరూ గబ్బర్ సింగ్ అంటూ ఉంటారు..ఈ పేరు పెట్టడానికి కారణం ఒకప్పుడు ఓల్డ్ సిటీలో ఒక పోలీస్ అధికారి ఉండేవారు అప్పట్లో అందరూ ఆయనను గబ్బర్ సింగ్ అని పిలిచేవారు. ఆయన్ని నేను కూడా చూశాను కానీ పెద్దగా పరిచయం లేదు.. ఆ పేరు నాకు చాలా నచ్చింది. అందుకే ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చూశాక దానికి గబ్బర్ సింగ్ పేరు అయితే సరిపోతుందని ఆ పేరు పెట్టాను.. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు