War 2: బాలీవుడ్ లో టాప్ ఏజెన్సీని సెట్ చేసిన తారక్

War 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో ఎన్టీఆర్ ఒకరు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇదే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ నాకు తమ్ముడు లాంటివాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా, ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని చెప్పొచ్చు. వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా లభించింది.

ఇకపోతే ఈ సినిమా తోనే పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ కు గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా ఈ సినిమా పైన అంచనాలను మరింత పెంచిందని చెప్పొచ్చు. సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

తారక్ బాలీవుడ్ స్ట్రాటజీ

ఇకపోతే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ చేస్తున్న మరో సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించినున్నాడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ సినిమాతో మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఇకపోతే బాలీవుడ్ లో కూడా తన మార్కెట్ ను డెవలప్ చేసుకోవడానికి ఒక టాప్ ఏజెన్సీని ఎన్టీఆర్ నియమించుకున్నట్లు తెలుస్తుంది.

ఆ టాప్ ఏజెన్సీ ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటుందట. అలానే ఎన్టీఆర్ కు కొన్ని యాడ్స్ కూడా తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ ప్రతిభ ఏంటి అనేది తెలుగు ప్రేక్షకులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం నటనలోనే కాకుండా డాన్స్ లో కూడా తనదైన శైలిని చూపిస్తాడు తారక్. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన మార్కెట్ చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వార్ 2 సినిమా కోసం ఆడియన్స్ మంచి అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Shooting pics from War 2
Shooting pics from War 2

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు