Anchor Ravi.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న యాంకర్ రవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు హోస్ట్ వ్యవహరించడమే కాదు.. సినిమా ఈవెంట్ లకి కూడా ఈయన హోస్ట్ గా వ్యవహరిస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా బుల్లితెర షో లో విషయానికి వస్తే.. గతంలో సంథింగ్ స్పెషల్, పటాస్, ఆడాళ్ల మజాకా వంటి టీవీ షో లతో ఫుల్ ఎనర్జిటిక్ గా యాంకరింగ్ చేసి బాగా పాపులారిటీ తెచ్చుకున్న ఈయన .. అన్ని చానల్స్ లో అనేక రకాల టీవీ షోలు చేసి మెప్పించారు.. ప్రస్తుతం ఒకటి రెండు టీవీ షోలు, ప్రోగ్రామ్స్ లో మాత్రమే కనిపిస్తూ సందడి చేస్తున్నారు..
దావత్ షో లో రవి..
ఇదిలా ఉండగా తాజాగా రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తున్న దావత్ షో కి గెస్ట్ గా వచ్చారు యాంకర్ రవి. ఇందులో భాగంగానే తన లైఫ్ గురించి, తన లైఫ్ లో జరిగిన వివాదాలు ,ఫ్యామిలీ విశేషాలు ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. కెరియర్ మొదట్లో కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈయన యాంకర్ గా ఎలా మారారు అన్న విషయాలను రవితో చెప్పించే ప్రయత్నం చేసింది రీతూ చౌదరి.
కొరియోగ్రాఫర్ టూ యాంకర్..
రవి మాట్లాడుతూ.. చిరంజీవి లాగా పెద్ద హీరో అయిపోవాలని ఇండస్ట్రీకి వచ్చాను.. మొదట కొరియోగ్రాఫర్ గా పనిచేశాను.. మొదట కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నప్పుడు సాఫ్ట్ వేర్ వాళ్ళకి , ప్రైవేట్ పార్టీలకు , లేడీస్ పార్టీలకు వెళ్లి అక్కడి వాళ్లకి డాన్స్ నేర్పించడం.. డాన్స్ చేయడం లాంటివి చేసేవాడిని.. అలాంటి సమయంలో అమలా అక్కినేనితో పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత నాగార్జున పరిచయమయ్యారు.. నాగార్జునతో ఇలా హీరో అవ్వాలి… పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి అని చెప్పాను.. ఇక ఆయన నా ఎనర్జీ చూసి మా మ్యూజిక్ ఛానల్ సంథింగ్ స్పెషల్ షో కి యాంకర్ ని చేశారు.. అక్కడి నుంచి నా కెరియర్ యాంకర్ గా మొదలైంది.. అంటూ తెలిపారు..
లైఫ్ లో అప్పుడే రియలైజ్ అయ్యా..
సంథింగ్ స్పెషల్ షో లో యాంకర్ గా చేస్తున్నప్పుడు నేను రియలైజ్ అయ్యాను.. జీవితంలో చిరంజీవి లాగా ఎదగడం చాలా కష్టం.. ఆ స్థాయికి చేరుకోలేము.. కానీ మనకు గుర్తింపు రావాలి అంటే మనం కొంచెం కష్టపడాలి అని అనుకున్నాను.. అప్పుడే ఆ సంథింగ్ స్పెషల్ షో ను ఇంకా స్పెషల్ ఎలా చేయాలి? అని ఆలోచించి.. ఒక లేడీ యాంకర్ ని తీసుకొచ్చి ఆ షో ని పెద్ద హిట్ చేశాము అంటూ తెలిపారు రవి..
అలా మొత్తానికైతే కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి పెద్ద హీరో అవుతాం అనుకున్న యాంకర్ రవి చివరికి నాగార్జున కారణంగా యాంకర్ గా మారి.. ఇప్పుడు తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు.. అంతేకాదు సినిమాలలో అడపాదడపా నటిస్తూ వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు.