Sri Leela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్స్ లో శ్రీ లీల కూడా ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ బ్యూటీ ధమాకా తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది.
రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక అనంతరం నుంచి శ్రీ లీల రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ తరువాత బాలకృష్ణ, రామ్ పోతినేని, నితిన్, మహేష్ బాబు, రవితేజ ఇలా పలువురు స్టార్ హీరోల తో జతకట్టి తన టాలెంట్‌ను ప్రదర్శించింది. ఇక ఈ బ్యూటీ డాన్స్ కి స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన శ్రీ లీల మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పటికే తన ఖాతాలో నాలుగు ఫ్లాప్స్ ఉన్నాయి. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గించారు డైరెక్టర్స్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు విజయ్ దేవరకొండ తో సినిమాలు చేస్తుంది. గతంలో వచ్చినని ఆఫర్స్ రాకపోయినా ఏదో అడపాదడపా అవకాశాలు దక్కుతున్నాయి. ఇదే క్రమంలో తన అందాలను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తుంది శ్రీ లీల. అవకాశాలు లేకపోవడంతో ఎక్స్పోజింగ్ డోస్ మరింత పెంచింది. జీన్స్ షర్ట్ అండ్ మోడల్ ఫ్యాంట్ ధరించి ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.