Divi Vadthya: బిగ్బాస్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన బ్యూటీ దివి. ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపును సంపాదించుకుంది. అంతకుముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది. ఆ తరహా బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది ఈ బ్యూటీ.
అక్కడ తన అందాలతో పాటు గేమ్ తోను ఆకట్టుకుంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత.. చిరు గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న రోల్ ప్లే చేసింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 లో కీ రోల్ చేస్తుంది. అదేవిధంగా బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ అవకాశం దక్కించుకుంది.
ఇక సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే బ్యూటీ తాజాగా బ్రౌన్ కలర్ సారీ ధరించి రోడ్డుపై తన అందాలను అరబోసింది. కొంచెం సిగ్గును జోడించి రోడ్డుపై అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.