Manam Re-Release: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో తరతరాలుగా రాణిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. నందమూరి నాగేశ్వరరావు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలను అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగార్జున. ఇక అనంతరం నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ.. అఖిల్, నాగచైతన్య అరంగేత్రం చేశారు.
కానీ వీరిద్దరూ కూడా తమ తండ్రి మరియు తాత సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించుకోలేకపోయారు. ఇక వీరి ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మూవీ మనం. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రేయ కీలక పాత్రల్లో నటించిన సినిమానే మనం.
ఈ మూవీ విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమాని ఈ నెల పదవ తారీకున రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. టెన్ ఇయర్స్ ఆఫ్ మేజికల్ మనం అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ మూవీ ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అప్పట్లో ఈ సినిమా భారీ విజయంగా నిలిచింది. మరి ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ లో ఈ సినిమా ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఈ మూవీలో కీలక పాత్రలు పోషించిన శ్రేయ తప్పితే మిగిలిన వారు మొత్తం అక్కినేని ఫ్యామిలీకి చెందిన వారే.