Hanuman: వరుణ్ సందేశ్ హీరోగా 2015లో వచ్చిన ఎవరైనా ఎప్పుడైనా చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది విమల మోహన్. అనంతరం జగపతిబాబు తో గాయం 2, చట్టం, శ్రీకాంత్ తో.. రంగా ది దొంగ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీ నాగార్జున తో కూడా జతకట్టింది.
చెప్పుకోవడానికి పెద్ద ఛాన్సులు వచ్చిన ఈమె ఖాతాలో సరైన సక్సెస్ అయితే పడలేదు. గత ఏడాది రుద్రంగి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ దక్కించుకుంది. కానీ ఈమె రీ ఎంట్రీని జనాలు పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవధారి అర్జున సినిమాలో కూడా నటించింది. ఈ మూవీ కూడా ఫ్లాప్ గా నిలిచింది.
ఇక ఇదిలా ఉంటే హనుమాన్ మూవీ లో విలన్ అయినటువంటి వినయ్ రాయ్ తో ఈమె డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా ఈ జంట ఓ రొమాంటిక్ ఫోటోషూట్ తో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ ఫోటోలను విమల రామన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి.. వీటికి వివి అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.