Deepika Padukone : ‘కల్కి’ కోసం ఆ పని కూడా పూర్తి చేసేసిన దీపికా..!

Deepika Padukone : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమా రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం కూడా లేదన్న విషయం తెలిసిందే. అందుకే చిత్ర యూనిట్ పనుల్లో రెట్టించిన వేగం పుంజుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వంటి తారాగణం ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసేయగా, మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందన్న విషయం తెలిసిందే. ఇక దీపిక తెలుగులో చేస్తోన్న మొదటి చిత్రం కల్కి 2898AD. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో జూన్ 27న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898AD సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో కల్కి టైటిల్ రోల్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడు.

డబ్బింగ్ పనులు పూర్తి చేసిన దీపికా..

ఇక ఈ సినిమాను ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఫిక్షనల్ కథాంశంతో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ ఉంటుందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే (Deepika Padukone) కెరియర్ లోనే అతి పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం కోసం దీపికా కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు. అయితే ప్రభాస్ కి జోడీగా చాలా బలమైన క్యారెక్టర్ ని దీపికా పదుకునే ఈ చిత్రంలో చేస్తోందట. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ కల్కి 2898AD లో తన క్యారెక్టర్ కి సంబందించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసిందంట. తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో దీపికా పదుకునే తన పాత్రకి డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీపికా పదుకునే మాతృభాష కన్నడ అనే సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం దీపికా పదుకునే గర్భవతిగా ఉంది. దీంతో జూన్ నెల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోనుంది. ఈ కారణంగా అందరికంటే ముందుగా తన డబ్బింగ్ ని దీపికా పూర్తి చేసిందంట. అలాగే ప్రమోషన్స్ కి కావాల్సిన ఇంటర్వ్యూలు కూడా ముందుగానే ఇవ్వనుందంట.

Deepika Padukone finished dubbing for the movie Kalki2898AD

- Advertisement -

ప్రమోషన్లలోనూ ముందున్న దీపికా?

ఇక దీపికా పదుకునే (Deepika Padukone) అందరికంటే ముందు సినిమా ప్రమోషన్లలో పాల్గొననుందట. త్వరలో కల్కి 2898 AD ప్రమోషన్స్ కోసం దీపికా పదుకునే స్పెషల్ ఇంటర్వ్యూని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. కల్కి 2898AD చిత్రాన్ని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనతో చిత్ర యూనిట్ ఉంది. ఇక దీపికా పదుకునే ఇప్పటికే హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే ఇమేజ్ కల్కి మూవీకి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పాటని వంటి తారలు నటిస్తున్న ఈ సినిమా ఫైనల్ గా జూన్ 27న రిలీజ్ అవుతుండగా, బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు టార్గెట్ గా కల్కి దిగుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు