South Movies Releasing This Week : ఎలెక్షన్ హడావిడి తెలుగు రాష్ట్రాలలో మే 13 న పూర్తయ్యింది. ఇప్పుడు మూవీ లవర్స్ అంతా ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ నుండి పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ కామెడీ మూవీ గురువాయూర్ అంబలనాదయిల్ వరకు ఈ వారం విడుదలవుతున్న టాప్ సౌత్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
సౌత్ ఫిల్మ్స్ ఈ వారం విడుదలవుతున్నాయి
1. సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సత్యభామ ఈ వారం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. మే 17న థియేటర్లలోకి రానుంది ఈ మూవీ. తప్పిపోయిన వ్యక్తి కేసును దర్యాప్తు చేస్తున్న ఏసిపి సత్యభామ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. సత్యభామ గతం ఆమెను వెంటాడుతుంది. మరోవైపు కేసు విచారణలో నిజం తెలుసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో పాటు అనిరుధ్ పవిత్రన్, రవివర్మ, హర్షవర్ధన్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
2. విద్యా వాసుల అహం
విద్యా వాసుల అహం మూవీ కథ స్వతంత్ర, ఇగో-సెంట్రిక్ జంట అయిన విద్య, వాసు చుట్టూ తిరుగుతుంది. వారి పెళ్లి తర్వాత ప్రేమ ప్రయాణం ప్రారంభమవుతుంది. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన విద్యా వాసుల అహం మూవీలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ కూడా మే 17 న రిలీజ్ కాబోతోంది.
3. గురువాయూర్ అంబలనాడాయిల్
విపిన్ దాస్ దర్శకత్వం వహించిన గురువాయూర్ అంబలనాడయిల్ అనేది మలయాళ కామెడీ మూవీ. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలలో నటించారు. పరిస్థితుల కారణంగా తనను ద్వేషించిన యువతిని వివాహం చేసుకున్న యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్‌లతో పాటు గురువాయూర్ అంబలనాడయిల్లో నిఖిలా విమల్, అనశ్వర రాజన్, జగదీష్, బైజు సంతోష్, ఇర్షాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 16న థియేటర్లలో విడుదల కానుంది.
4. రాజు యాదవ్
చివరిది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు రొమాంటిక్-డ్రామా రాజు యాదవ్. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రాజు యాదవ్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. రాజుకు అరుదైన ముఖ రుగ్మత ఏర్పడుతుంది. అతను ఆపకుండా నవ్వుతూనే ఉంటాడు. ఈ జబ్బు అతని జీవితాన్ని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. ఈ చిత్రంలో అంకితా ఖరత్, గెటప్ శ్రీను, ఆర్జే హేమంత్, రాకెట్ రాఘవ, చక్రపాణి ఆనంద, భూషణ్ కళ్యాణ్, పవన్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. రాజు యాదవ్ మూవీని మే 17న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఇక ఇప్పుడు ఎలెక్షన్ల హడావిడి ముగిసింది. కాబట్టి ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు కంటెంట్ బాగున్న సినిమాలకు కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.