Aranmanai4 : డివైడ్ టాక్ తో బయ్యర్లకు లాభాలు.. ఏకంగా 66 కోట్ల డబుల్ బ్లాక్ బస్టర్..

Aranmanai4 : ప్రముఖ కోలీవుడ్ దర్శక నటుడు సుందర్. సి దర్శకత్వం వహించిన అరణ్మణై4 చిత్రం థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా ఆ సినిమా తమిళనాడులో భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా, బయ్యర్లకు రెండు రెట్ల లాభాన్ని అందించి ట్రేడ్ పండితులని శాతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇంకా స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే హారర్ కం, డివోషనల్ ఫాంటసీ జోనర్ లో సినిమాలను తెరకెక్కించే సుందర్ సి అరణ్మనై హారర్ సిరీస్ లో నాలుగో భాగంగా, హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన చిత్రం అరణ్మణై4. తెలుగులో ఈ సినిమా ‘బాక్’ పేరుతొ రిలీజ్ అయింది. రెండు వారాల కింద అనగా మే 3న రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో నటించారు. తెలుగులో ఈ సినిమా థియేటర్లో ఆడకపోగా, తమిళ్ లో మాత్రం భారీ కలెక్షన్లు రాబడుతుంది. డివైడ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమాకి ముఖ్యంగా తమిళనాడు లో సినిమా కరువులో ఉన్నట్టు ఈ రొట్ట సినిమాకి ఎగబడ్డారు.

డివైడ్ టాక్ తో సూపర్ కలెక్షన్లు..

ఇక తెలుగులో బాక్ (Aranmanai4) పేరుతో రిలీజ్ అయిన అరణ్మణై 4  కి మరీ రొటీన్ అయిన హర్రర్ కామెడీ వలన మిక్సడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. ఇక్కడ ఈ సినిమాకి డిజాస్టర్ వసూళ్లు వచ్చాయి. తెలుగులో ఇప్పటివరకు 4 కోట్ల గ్రాస్ రాగా, 2 కోట్ల కి అటు ఇటుగా షేర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక మూడు కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా తెలుగులో మరో కోటికి పైగా వసూళ్లు తెచ్చుకోవాలి. ఇక అరణ్మణై 4 సినిమా తమిళనాడులో మాత్రం సూపర్ కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికి రోజుకి కోటికి తగ్గకుండా వసూళ్లు రాబడుతుంది ఈ చిత్రం. ఇక పన్నెండో రోజు కూడా ఈ సినిమా 1.65 కోట్లు రాబట్టడం విశేషం. ఇక అరణ్మణై ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రాబట్టిన వసూళ్ళని గమనిస్తే..

Aranmanai4 movie latest collections

- Advertisement -

అరణ్మణై4 వరల్డ్ వైడ్ వసూళ్లు…

అరణ్మణై 4 వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లు సాధించగా, ఏరియా వారీగా చూసుకుంటే ఇలా ఉన్నాయి. తమిళనాడులో 43.50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు, కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 4.05 కోట్లు, ఓవర్సీస్ లో 14.85 కోట్లు కలిపి, వరల్డ్ వైడ్ గా 66.40 కోట్ల గ్రాస్ ని 32.05 కోట్ల షేర్ ని సాధించింది. మొత్తం మీద సినిమా బీలో యావరేజ్ రెస్పాన్స్ తో కూడా 12 రోజుల్లో ఈ సినిమా 66.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 18 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 14 కోట్ల రేంజ్ లో లాభంతో బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక అరణ్మణై సిరీస్ లో మొదటి రెండు పార్ట్స్ హిట్ అవగా, మూడో భాగం ప్లాప్ అయింది. అయినా సరే నాలుగో సీక్వెల్ తీసి భారీ లాభాలని అందుకున్నారు సుందర్. ఇక ఈ సినిమాను దర్శకుడు సుందర్ భార్య ఖుష్బూ తో కలిసి సొంత నిర్మాణంలో తీయగా, ఈ సినిమాతో భారీ లాభాలని అందుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు