Devara : నాగ వంశీ మరో కాంట్రవర్సీయల్ స్టేట్మెంట్

Devara: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో హారిక హాసిని బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్లో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే సినిమాలు చేస్తూ ఉంటారు. సూర్యదేవర రాధాకృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారు. అయితే దీనికి అనుబంధంగా ఉన్న సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్లు కూడా చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. జెర్సీ లాంటి నేషనల్ అవార్డు సాధించిన సినిమా కూడా ఈ బ్యానర్ లో వచ్చింది.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యానర్ లో వచ్చిన చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ను రాబడతాయి. అలా వచ్చిన సినిమాలు మ్యాడ్ సినిమా ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఈ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా కూడా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు నాగ వంశీ. వేదిక ఎక్కిన ప్రతిసారి కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతారు. ఇకపోతే కేవలం సితార సినిమాలు గురించి మాత్రమే కాకుండా, హారిక హాసిని బ్యానర్ లో వచ్చే సినిమాలు గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలా చాలాసార్లు నా గురించి స్టేట్మెంట్లు అన్నీ కూడా వైరల్ గా మారాయి.

Devara : Naga Vamsi is another controversial statement
Devara : Naga Vamsi is another controversial statement

నిర్మాత మాత్రమే కాదు ఎన్టీఆర్ అభిమాని కూడా
ఇకపోతే స్వతహాగా నాగ వంశీ ఎన్టీఆర్ కి ఎంత పెద్ద అభిమానో చాలామందికి తెలిసిందే. ఇది చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ సింగల్ అప్డేట్ ను అఫీషియల్ గా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ పాట గురించి నాగ వంశీ కూడా ఒక స్టేట్మెంట్ను పాస్ చేశాడు. ఈ సాంగ్ విన్న వెంటనే అనిరుద్ జైలర్లో కంపోజ్ చేసిన హుకుం సాంగ్ ని మర్చిపోతారంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

హుకుమ్ పాట మర్చిపోతారు
ఇకపోతే నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో హుకుం సాంగ్ కూడా మంచి హిట్ అయింది. ఇదే పాటను అనిరుద్ కన్సర్ట్ పాడి బాగా ఫేమస్ అయ్యాడు. ఇకపోతే ఆ సాంగ్ ని మర్చిపోయా రేంజ్ లో ఈ సాంగ్ ఉండబోతుంది అని చెప్పడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇకపోతే ఈ స్టేట్మెంట్ ను కొంతమంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఏదేమైనా మే 19న ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటో తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు