Double Ismart : 24 గంటల రిపోర్ట్.. అనుకున్నంత లేదు..!

Double Ismart : టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా అభిమానుల క్రేజ్ ని సంపాదించిన రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ గా అభిమానులని ఓ రేంజ్ లో అలరించాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఊర మాస్ కమర్షియల్ సినిమాగా వచ్చి థియేటర్లలో దుమ్ములేపింది. ఈ సినిమాలో రామ్ తన పెర్ఫార్మన్స్ తో కేక పుట్టించాడు. అన్ సీజన్లో రిలీజ్ అయినా కూడా ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టించి రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సూపర్ కం బ్యాక్ ని ఇచ్చింది. ఇప్పుడు అదే కాంబోలో మళ్ళీ దానికి సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” (Double Ismart) వస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి ఊరిస్తున్న ఈ సినిమా నుండి రామ్ బర్త్ డే స్పెషల్ గా టీజర్ రిలీజ్ అయింది. ఇక ఈ సారి డబుల్ ట్రీట్ ఇస్తామని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.

24 గంటల రిపోర్ట్.. అంత లేదు..

ఇక డబుల్ ఇస్మార్ట్ టీజర్ పక్కా పూరి స్టైల్ లో గన్ ఫైరింగ్ తో స్టార్ట్ అయి పూరి మార్క్ డైలాగులతో రామ్ ‘ఉస్తాద్ ఇస్మార్ట్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అంటూ ఎంట్రీ ఇస్తాడు. అచ్చం అప్పటి ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్లు ఎలా ఉన్నాయో అలాగే ఈ సినిమా టీజర్ ని డిజైన్ చేసారు. అయితే దీని వల్ల టీజర్ లో కొత్తదనం మిస్ అయి ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్స్ చేయలేదు.అయితే కథలో కొత్తదనం లేకపోయినా తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో పూరి ఈసారి మెప్పిస్తాడని ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ నమ్ముతున్నారు. ఇక ముంబై డాన్ గా సంజయ్ దత్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ చూపిస్తాడని అనుకున్నా, అంతగా చూపించలేదు. ఇక టీజర్ మొత్తంలో ఫైట్స్ సీన్స్, డైలాగులతో నింపేసిన పూరి కథ నేపథ్యమేమి పెద్దగా చెప్పలేదు. కానీ పూరి ఇస్మార్ట్ స్టైల్ లోనే ఉంటుందని తెలుస్తుంది. ఇక టీజర్ లో మణిశర్మ బీజీఎమ్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా 24 గంటలు పూర్తయ్యే సరికి అబౌ యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 24 గంటల్లో డబుల్ ఇస్మార్ట్ 7.4 మిలియన్ల వ్యూస్ ని, 212k లైక్స్ ని సాధించింది.

Double Ismart Teaser 24 Hours Report

- Advertisement -

కొత్తదనం చూపించకపోతే కష్టమే..

ఇక డబుల్ ఇస్మార్ట్ టీజర్ 24 గంటల రిపోర్ట్ ప్రకారం ఒక మీడియం రేంజ్ సినిమాకి ఈ వ్యూస్ కరెక్ట్ గానే వచ్చినా పూరి రాపో బ్లాక్ బస్టర్ కాంబో సీక్వెల్ కి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేసారు నెటిజన్లు. అయితే మామూలుగా పూరి చాలా సినిమాలు సోషల్ మీడియాలో అంతగా టాక్ తెచ్చుకోలేకపోయినా, థియేటర్లలో మెప్పిస్తాయి. అలాగే డబుల్ ఇస్మార్ట్ కూడా థియేటర్లలో అదరగొడుతుందని పూరి ఫాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ టీజర్ లో అనౌన్స్ చేయలేదు గాని, జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమా మెప్పిస్తే 200 కోట్లు పక్కా అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు