Panchayat Season 3 Promo : సీజన్ 3లో ఈసారి కామెడీతో పాటు మసాలా… బాలీవుడ్ ఐటెం బాంబ్ అందుకే దింపుతున్నారా?

Panchayat Season 3 Promo : మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 3 త్వరలోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ కు సంబంధించి రోజుకో ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేస్తూ మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. ఈసారి కామెడీతో పాటే మసాలా కూడా ఉండబోతోందని తాజా ప్రోమో ద్వారా వెల్లడించారు.

తాజా ప్రోమోలో హాట్ బాంబ్

సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ ను మూడవ సీజన్ పంచాయత్ కోసం రంగంలోకి దించుతున్నారు. బోల్డ్ ఫోటోలతో తరచుగా వార్తల్లో నిలిచే ఉర్ఫీ ఊహించని విధంగా ఈ సీజన్ లో నటించబోతోంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రైమ్ వీడియో తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రామ పంచాయత్ ఆఫీసు బయట ఉర్ఫీ జావేద్ చిట్టి పొట్టి బట్టలు వేసుకుని కన్పించింది. ఆమెతో పాటే ప్రముఖ గాయకుడు కింగ్, పారిశ్రామికవేత్త అనుపమ్ మిట్టల్‌ కూడా ఈ ప్రోమోలో మెరవడం విశేషం. ఈ తాజా ప్రోమో పంచాయత్ సీజన్ 3 పై మరింత ఆసక్తిని పెంచేసింది.

చెప్పిన డేట్ కంటే ముందే ట్రైలర్ రిలీజ్

జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ నిన్న విడుదలైంది. ట్రైలర్‌ను మే 17న విడుదల చేయనున్నట్టు ప్రకటించినప్పటికీ మేకర్స్ మాత్రం ముందుగానే విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. పంచాయత్ సీజ‌న్ 3 ట్రైల‌ర్ చూస్తుంటే ఈసారి క‌థ గ‌త రెండు సీజ‌న్‌ల‌ కంటే చాలా భిన్నంగా ఉంద‌ని, కానీ స్టోరీని ఆ రెండు సీజ‌న్‌ల‌తో క‌నెక్ట్ చేస్తార‌ని తెలుస్తుంది. విశేషమేమిటంటే పాత్రలన్నీ పాతవే కావడం వల్ల చూడాలనే ఆసక్తి కలుగుతుంది. పైగా మరికొన్ని కొత్త పాత్రలను కూడా యాడ్ చేస్తున్నారు.

- Advertisement -

ట్రైలర్ టాక్…

పంచాయత్ సీజ‌న్ 3 ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. రెండో సీజన్ ఎండింగ్ లో సెక్రటరీ బదిలీకి సంబంధించిన సన్నివేశాలను చూపించారు. మూడో సీజన్ కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. ఫూలేరా అధిపతి మంజు దేవి సెక్రటరీ బదిలీని ఆపారు. సెక్రటరీ తిరిగి వచ్చి తన చదువును ప్రారంభిస్తాడు. కానీ ఈలోగా బనారకాస్ రోడ్డు నిర్మాణం విషయంలో గ్రామంలో గొడవలు సృష్టించి చాలా వివాదాలకు దారి తీశాడు. ఈ వివాదం అంతా కామెడీతో సాగుతుందని అర్థంఅవుతోంది. బనారకాస్ ఎన్నికలలో పోటీకి నిలబడతారు. ఇలా పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ సరదాగా అనిపిస్తుంది. పంచాయత్ సీజన్ 3ని అమెజాన్ ప్రైమ్ లో మే 28న విడుదల చేయనున్నారు.

పంచాయత్ స్టోరీ..

ఒక కార్పొరేట్ కుర్రాడు గ్రామ కార్యదర్శి అవుతాడు. దీని కారణంగా అంతకుముందెప్పుడూ ఊరిలో నివసించని వ్యక్తి ఊరికి వచ్చి బతకాల్సి వస్తుంది. దీంతో అతని జీవితం ఎలా అల్లకల్లోలంగా మారుతుందో ఫన్నీ వేలో చూపించారు. ఈ వెబ్ సిరీస్ కు దీపక్ మిశ్రా దర్శకత్వం వహించగా, ది వైరల్ ఫీవర్ పతాకంపై శ్రేయాన్స్, పాండే, విజయ్ కోషి, అర్నాబ్ కుమార్ నిర్మించారు. ఫస్ట్ సీజన్ 2020 ఏప్రిల్ 3న, సెకండ్ సీజన్ 2022 మే 20న రిలీజ్ అయ్యాయి. మే 28న మూడవ సీజన్ రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు