RC16 Songs: ఏఆర్ రెహమాన్.. ఈ పేరు ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి పెద్దగా పరిచయం లేకపోయినా గతంలో ఏఆర్ రెహమాన్ అంటేనే మ్యూజిక్ మ్యూజిక్ కంటే ఏఆర్ రెహమాన్. ఆ విధంగా ఈయన పేరు మారుమోగేది. కానీ ప్రస్తుతం ఈయనకి ఎవ్వరూ పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. థమన్ వంటి వారు ఫామ్ లో ఉండడంతో ప్రతి ఒక్కరూ వారిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇందువల్లే ఏఆర్ రెహమాన్ కి పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ఇటువంటి క్రమంలోనే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ రాకరాక ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు ఏఆర్ రెహమాన్. మెగాస్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ వచ్చే నెలలోగా పూర్తి అవుతుందని శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక ఇది పూర్తిగా గాగానే బుచ్చిబాబు డైరెక్షన్లో RC16 షూటింగ్ లో చరణ్ జాయిన్ అవుతారు. ఇక మొదటి షెడ్యూల్లోనే సాంగ్ చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం వినిపిస్తుంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కెరీర్ లో రెగ్యులర్ షూట్ ప్రారంభం కాకముందే మూడు సాంగ్స్ రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. తన కెరీర్ లో ఎన్నో ఘనతలను సాధించిన ఈయన తాజాగా ఈ ఘనత కూడా సాధించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు.