Dhanush.. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎప్పటికప్పుడు బయటకి వస్తూ ఉంటాయి. ఇక అందులో భాగంగానే ముఖ్యంగా పెళ్లి , విడాకుల విషయాలు కూడా బయటకి వస్తూ సెలబ్రిటీలను మరింత పాపులర్ చేస్తూ ఉంటాయి. ఇకపోతే చాలామంది సెలబ్రిటీలు ఇలాంటివి బయటకి చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు.. కానీ వాళ్లకు తెలియకుండానే ఆ విషయాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని కో ఇన్సిడెంట్ పరంగా జరిగిన విషయాలు కూడా అయి ఉంటాయి.. అలా ఒక హీరోతో సినిమా చేసిన కారణంగా దాదాపు 11 మంది తమ రిలేషన్ షిప్ లో బ్రేకప్ చేసుకోవడం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..అయితే ఆ హీరో వల్ల ఏం జరగలేదు.. కానీ అనుకోకుండా.. ఆ హీరోతో సినిమా చేసిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం లేదా ప్రేమలో ఉన్న వాళ్ళు బ్రేకప్ చెప్పుకోవడం లాంటివి జరిగాయి.. ఇక ఆ హీరో ఎవరో కాదు ధనుష్ ..ఇటీవల తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఇకపోతే ధనుష్ తో పని చేసిన కొంతమంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో తమ భాగస్వామ్యుల నుంచి విడిపోయారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
నయనతార:
లేడీ సూపర్ స్టార్ నయనతార, ధనుష్ కలిసి యారడీ నీ మోహిని సినిమాలో నటించారు. అప్పటికే నయనతార ప్రభుదేవాతో ప్రేమలో ఉంది.. వీళ్ళిద్దరూ మూడున్నర సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు.. ఇక 2008 లో ఈ సినిమా వచ్చింది.. 2011లో నయనతార ప్రభుదేవా వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రభుదేవా భార్య రమా లతా కారణంగా వీరు వివాహం చేసుకోలేకపోయారు.
సోనియా అగర్వాల్:
సోనియా అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.. ధనుష్ తో కలిసి ఈమె కాదల్ కొండేన్ సినిమాలో నటించారు.. అప్పటికే ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ తో ప్రేమలో ఉన్న ఈమె.. సెల్వ రాఘవన్ ను పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి చేసుకున్నాక విడిపోయారు.
దివ్య దర్శిని:
దివ్యదర్శని ధనుష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పవర్ పాండి. ఈ సినిమాలో నటించేటప్పుడు ఆమె తన స్నేహితుడు శ్రీకాంత్ రవిచంద్రన్ ను 2014లో పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత 2017లో విడిపోయింది.
త్రిష:
త్రిష కు ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం జరిగింది. అయితే ధనుష్ హీరోగా నటించిన కోడి సినిమాలో ఈమె నటించిన తర్వాత కొన్ని కారణాలవల్ల వరుణ్ తో నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకుంది.
సమంత:
సమంత ధనుష్ తో కలిసి తంగమగన్ అనే సినిమాలో నటించింది ..ఆ తర్వాత నాగచైతన్యని పెళ్లి చేసుకున్న ఈమె రెండేళ్లకే విడిపోయింది.
అమలాపాల్:
అమలాపాల్ రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ సరసన నటించింది. విజయ్ అనే దర్శకుడు తో ఈమె పెళ్లి జరగగా.. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు..
హన్సిక:
ధనుష్ తో కలిసి మాపిళ్ళై అనే సినిమాలో నటించారు.. అప్పుడు హన్సిక హీరో శింబుతో ప్రేమలో పడింది.. మరోపక్క వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేస్తూన్నారు.. అప్పుడే ప్రేమలో పడగా రెండు సంవత్సరాల రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత హన్సిక శింబు నుంచి విడిపోయి తన స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ ను వివాహం చేసుకుంది.
ఎమీ జాక్సన్:
ధనుష్ హీరోగా నటించిన తంగమగన్ సినిమాలో సమంత తో పాటూ ఈమె కూడా నటించింది. 2015 లో ఈమె జార్జ్ అనే వ్యక్తిని ప్రేమించింది.. 2019లో విరిద్దరికి ఎంగేజ్మెంట్ జరగగా.. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
అనిరుద్ రవిచందర్..
ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమాతో అనిరుద్ రవి చందర్ సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. అప్పటికే ఈయన ఆండ్రియాతో రిలేషన్షిప్ లో ఉండగా ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
జీవి ప్రకాష్ కుమార్:
ధనుష్ తో జీవి ప్రకాష్ కుమార్ చాలా సినిమాలకు ట్రావెల్ చేశారు.. ఇటీవల తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు.
కార్తీక్:
యారడి నీ మోహిని సినిమాలో హీరో స్నేహితుడిగా ఈయన నటించారు.. ఈయన స్టాండ్ అప్ కమెడియన్ కూడా.. సింగర్ సుచిత్రా ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు..
అలా వీళ్లంతా కూడా ధనుష్ తో కలిసి పనిచేసిన తర్వాత యాదృచ్ఛికంగా తమ భాగస్వాముల నుండి విడిపోయారు.