Toxic : యష్ సినిమా అప్డేట్.. అసలు మొదలైందా అన్న దానిపైనే క్లారిటీ లేదు..!

Toxic : కన్నడ రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడలో మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి, మాస్టర్ పీస్ వంటి సినిమాలతో స్టార్ హీరో అయిన యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ సీరీస్‌తో పాన్ ఇండియా స్టార్ గా భారీ స్టార్ డమ్ అందుకున్నాడు. కేజిఎఫ్ 1,2 సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న యష్ దాదాపుగా సినిమాలకు రెండేళ్లు గ్యాప్ ఇచ్చాడు. ఏడాదిన్నర తర్వాత ఓ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. ప్రముఖ మలయాళం డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ యష్ హీరోగా తెరకెక్కించబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి “టాక్సిక్” అనే టైటిల్ కూడా పెట్టినట్టు తెలిసిందే. ఇక ఈ సినిమా ఫిక్స్ అయి ఆల్మోస్ట్ ఎనిమిది నెలల పైనే అవుతుంది. కన్నడలో భారీ ప్రొడక్షన్ సంస్థ అయిన KVN ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నట్టు సమాచారం. కానీ వారి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Rocking Star YashToxic Movie update

పాన్ ఇండియా కాస్ట్..

ఇక యష్ హీరోగా నటించబోయే టాక్సిక్ లో భారీ తారాగణం నటిస్తున్నట్టు చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటించబోతున్నట్లు మాత్రం రూమర్స్ వినిపించాయి. కానీ అది నిజం కాదని తేలింది. ఇక తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికోసం నయన్ 10 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకోనుందట. అలాగే హీరోయిన్ గా కియారా అద్వానీ ఆల్మోస్ట్ కంఫర్మ్ అయినట్టు సమాచారం. ఇక భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ వారు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 2025 ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. యష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటినుండో చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా అసలు మొదలైందా అన్న విషయంపైనే క్లారిటీ లేదు.

- Advertisement -

షూటింగ్ స్టార్ట్ అయిందా.. లేదా?

ఇదిలా ఉండగా టాక్సిక్ (Toxic) సినిమా అసలు మొదలైందా లేదా అన్న విషయం పై అందరికి అనుమానాలు ఉన్నాయి. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైందని, కర్ణాటకలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సినిమా మేకర్స్ నుండి షూటింగ్ కి సంబంధించి ఒక్క అఫిషియల్ అనౌన్స్ మెంట్ గాని, అన్ సీన్ స్టిల్ గాని బయటికి రాలేదు. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేసి పక్కాగా ఉన్నారు. ఏది ఏమైనా జూన్ లో ఈ సినిమా ఖచ్చితంగా రెగ్యులర్ షూట్ జరుపుకోవచ్చని, ఆ నెలలోనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇక టాక్సిక్ చిత్రం కూడా కేజిఎఫ్ తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ గురించి తప్ప మూవీ స్టోరీ గురించి, నటీనటుల గురించి మాత్రం ఎప్పటికప్పుడు వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు