Sujeeth & Nani : ఈ బ్యానర్లో కాకపోతే మరో బ్యానర్లో

Sujeeth & Nani : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో డి వి వి ఎంటర్టైన్మెంట్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ బ్యానర్ లో వచ్చిన ప్రతిష్టాత్మకమైన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి కలెక్షన్లు కొల్లగొట్టింది ఈ సినిమా. కేవలం కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి ఇంకొంచెం పెరిగింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు డి వి ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఓ జి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు.

రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ

రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుజిత్. ఈ సినిమా కంటే ముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అయితే ఆ షార్ట్ ఫిలిమ్స్ లో ఒక షార్ట్ ఫిలిమ్స్ చూసి ప్రభాస్ సుజిత్ ను పిలిపించి, రన్ రాజా రన్ అనే సినిమాకు యువి క్రియేషన్స్ లో అవకాశం వచ్చేలా చేసాడు. అయితే మొదటి సినిమాతోనే అద్భుతమైన హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత సాహో అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అని ఈ సినిమాను అద్భుతంగా తీశాడు అంటూ కొంతమంది సుజిత్ ని కొనియాడిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ తో ఓ జి

ఇకపోతే ప్రస్తుతం సుజిత్ చేస్తున్న సినిమా ఓజి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ దాదాపు 50 మిలియన్స్ వేసి కూడా దాటింది. వరుసగా రీమిక్స్ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రైట్ గా వస్తున్న సినిమా ఇది. అందుకోసమే ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇది గ్యాంగ్స్టర్ నేపథ్యంలో జరగబోయే సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ అయినట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అయితే దాదాపు పదేళ్ల కింద అదే డేట్ కు అత్తారింటికి దారేది అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి ఇండస్ట్రీలో ఆల్ టైం హిట్ గా నిలిచింది.

- Advertisement -
Sujeeth & Naani : If not in this banner then in another banner
Sujeeth & Naani : If not in this banner then in another banner

ఈ బ్యానర్లో కాకపోతే మరో బ్యానర్లో

ఇక ఈ సినిమా తర్వాత హీరో నానితో ఇదే బ్యానర్ లో సుజిత్ సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనికి తగ్గట్లుగానే ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న బడ్జెట్ కారణంగా ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ ఇప్పట్లో తీయలేదని తెలుస్తోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్టును డి వి ఎంటర్టైన్మెంట్స్ వదులుకుంటే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ పట్టాలెక్కించడానికి రెడీగా ఉంది. అయితే ఆ ప్రముఖ నిర్మాణ సంస్థ దగ్గర ఈ డైరెక్టర్ డేట్స్ కూడా ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఆ ప్రముఖ నిర్మాణ సంస్థ మరేదో కాదు అంటూ, అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీని గురించి ఇంకా అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు