Krithi Shetty: నిశ్చితార్థం చేసుకున్న కృతి శెట్టి.. పెళ్లిపై క్లారిటీ..!

Krithi Shetty.. ప్రముఖ కన్నడ బ్యూటీ కృతి శెట్టి తెలుగులో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఉప్పెన సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకోవడమే కాదు ఓవర్ నైట్ లోనే ఈ ముద్దుగుమ్మ ను స్టార్ హీరోయిన్ ని చేసేసింది.. అంతేకాదు ఈ ఒక్క సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.. అందులో భాగంగానే శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు విజయం అందుకోవడంతో హ్యాట్రిక్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త లోనే హ్యాట్రిక్ అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరిగా స్థానం సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక దాంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది.

కృతి శెట్టి పెళ్లి:

Krithi Shetty: Engaged Krithi Shetty.. Clarity on marriage..!
Krithi Shetty: Engaged Krithi Shetty.. Clarity on marriage..!

ఇక ఇటీవలే నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇకపోతే ఆ తర్వాత కోలీవుడ్ లోకి ప్రవేశించి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.ఈ క్రమంలోనే తాజాగా కృతి శెట్టి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా నిశ్చితార్థం చేసుకుందట.. కృతి శెట్టి నిశ్చితార్థం అయిపోయింది అంటూ కన్నడ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ గా మారుతోంది. తనను చిన్నతనంలోనే తన బావకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, నిర్ణయించుకున్నారట.. అందుకే ఆమెకు తాజాగా తన బావతో ఎంగేజ్మెంట్ కూడా చేసినట్లు ఒక వార్త వైరల్ గా మారుతోంది. ఇక ఇండస్ట్రీకి ఎంట్రీ ఎంత తక్కువ సమయంలోనే ఈమె పెళ్లి చేసుకోవడం ఏమిటి? తన కెరియర్ పైన ఇది ప్రభావం పడుతుందని ఆమె గ్రహించలేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.

కృతి శెట్టి సినిమాలు

కృతి శెట్టి ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్లో సూర్య , విశాల్ వంటి హీరోల సరసన నటించే అవకాశాలు సొంతం చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ ప్రాజెక్టులు సెట్ పైకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.. ఏది ఏమైనా కోలీవుడ్లోకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఏ మేరకు అక్కడ సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా ఏమైంది సినిమాలకు దూరం అవ్వాల్సి వస్తోందని వారు ఊహించలేదంటూ బాధపడుతున్నారు మరి నిజంగా ఆమె నిశ్చితార్థం చేసుకుందా? లేక ఇది రూమర్ మాత్రమేనా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై కృతి శెట్టి ఏ విధమైన క్లారిటీ ఇస్తుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు